రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై లోకి వస్తున్నాడు అన్న న్యూసే.
రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై లోకి వస్తున్నాడు అన్న న్యూసే.
వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమితో ఇటు రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీల భవిష్యత్ పై కొన్ని సందేహాలు వైరల్ గా మారాయి. అవేంటంటే? రోహిత్ శర్మ కెప్టెన్ గా తప్పుకోవడమే కాక.. టీ20లకు గుడ్ బై చెబుతాడని. ఇదే బాటలో కోహ్లీ కూడా వెళ్తాడని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఇది ఒకవైపు అయితే.. మరో వైపు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లోకి వస్తున్నాడు అన్న న్యూసే. ట్రేడింగ్ ద్వారా అతడిని ముంబై జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ వర్గాల్లో ఇప్పుడు ఓ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ టీమ్ లోకి వస్తున్నాడని. గుజరాత్ టీమ్ ను అద్భుతంగా నడిపిస్తూ.. ఆడిన రెండు సీజన్లలోనూ ఫైనల్ కు చేర్చి, ఓసారి విజేతగా, మరోసారి రన్నరప్ గా నిలిపాడు పాండ్యా. దీంతో అతడిని తిరిగి దక్కించుకోవానలి వ్యూహాలు రచిస్తోంది ముంబై యాజమాన్యం. అందులో భాగంగా ట్రేడింగ్ ద్వారా జోఫ్రా ఆర్చర్ ను వదులుకుని పాండ్యాని జట్టులోకి తీసుకోవాలని భావిస్తోందట. ఇక ఈ ట్రేడ్ జరిగితే ఐపీఎల్ లో ఇదే అతిపెద్ద డీల్ అవుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పాండ్యా ఒకవేళ ముంబై టీమ్ లోకి వస్తే, రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాండ్యా జట్టులోకి వచ్చినా.. ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మనే కొనసాగుతాడు. ఎందుకంటే హిట్ మ్యాన్ కెప్టెన్సీ అనుభవం ముందు పాండ్యా అనుభవం తక్కువనే చెప్పాలి. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్లలో హార్దిక్ గుజరాత్ టైటాన్స్ టీమ్ ను నడిపిన తీరు అమోఘం. ఇది దృష్టిలో పెట్టుకునే కొందరు ఇలా పాండ్యాకు సారథ్య బాధ్యలు అప్పగిస్తారని సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని ముంబై ఇండియన్స్ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని ఐదు సార్లు గెలిచి రికార్డు సృష్టించింది. రోహిత్ శర్మ భవిష్యత్ లో ఐపీఎల్ కు గుడ్ బై చెబితే.. అప్పుడు పాండ్యాకు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ విషయం తెలిసిన రోహిత్ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఒకవేళ పాండ్యా ముంబై టీమ్ కు వస్తే.. వీరిద్దరిలో కెప్టెన్ గా ఎవరు ఉంటే బాగుంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.