SNP
Rohit Sharma, Sachin Tendulkar, IND vs SL: టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా అదే స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ.. అదరగొడుతున్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కూడా హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. ఈ హాఫ్ సెంచరీతో రోహిత్ చరిత్ర సృష్టించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Sachin Tendulkar, IND vs SL: టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా అదే స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ.. అదరగొడుతున్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కూడా హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. ఈ హాఫ్ సెంచరీతో రోహిత్ చరిత్ర సృష్టించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. జట్టు మొత్తం లంక పిచ్‌లపై లంక బౌలర్లను ఎదుర్కొవడానికి ఆపసోపాలు పడుతుంటే.. రోహిత్ ఒక్కడే వేరే పిచ్‌పై ఆడుతున్నట్లు.. చెలరేగిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఇంకా అదే స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ.. అదరగొడుతున్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కూడా హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. తొలి వన్డేలో కూడా హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ ఇలా వరుస హాఫ్ సెంచరీలతో దూసుకెళ్తుంటే.. మిగతా బ్యాటర్లు విఫలం అవుతున్నారు. వారి వైఫల్యంతో తొలి వన్డే టై కాగా, రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. జట్టు ఓడినా.. కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సష్టించాడు.
రెండో వన్డేలో చేసిన హాఫ్ సెంచరీతో రోహిత్ కొత్త చరిత్ర లిఖించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఓపెనర్‌గా రోహిత్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఏకంగా 106 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే 48 సెంచరీలు చేశాడు. మొత్తంగా.. 154 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ. 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును రోహత్ అధిగమించాడు. ఓపెనర్‌గా 43 సెంచరీలు, 78 హాఫ్ సెంచరీలు సాధించాడు రోహిత్ శర్మ. అలాగే సచిన్ ఓపెనర్‌గా 45 సెంచరీలు, 75 హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో పాటు.. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించి.. నాలుగో స్థానంలోకి వచ్చాడు రోహిత్. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 40, కుసల్ మెండిస్ 30, దునిత్ వెల్లలాగే 39, కమిందు మెండిస్ 40 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 241 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేసి రాణించాడు. శుబ్‌మన్ గిల్ 35, అక్షర్ పటేల్ 44 రన్స్‌తో పర్వాలేదనిపించారు. కానీ, మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే ఏకంగా 6 వికెట్లతో ఇండియా ఓటమిని శాసించాడు. అలాగే కెప్టెన్ అసలంకా 3 వికెట్లతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమితో పాటు, రోహిత్ శర్మ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma has most fifty plus scores as an Indian opener in international cricket. 🚨 pic.twitter.com/WDwnku7YgS
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024