SNP
Rohit Sharma as Bus Driver: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా బస్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. మరి ఎందుకు బస్ డ్రైవర్‌గా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Rohit Sharma as Bus Driver: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా బస్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. మరి ఎందుకు బస్ డ్రైవర్‌గా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ తాజాగా ఆ జట్టు బస్ డ్రైవర్‌గా మారిపోయాడు. కెప్టెన్సీ పోయిన తర్వాత చాలా ఫన్నీగా వ్యవహరిస్తున్న రోహిత్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కి ముందు ఇలా బస్సు డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే.. టీమ్‌లో రోహిత్ శర్మకు ఎలాంటి ఇంపార్టెన్స్ లభిస్తోందోనని రోహిత్ అభిమానులు.. అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించిన సమయంలో తెగ కంగారు పడ్డారు. వారు భయపడినట్లే ఆరంభంలో రోహిత్ ఒంటరిగానే కనిపించేవాడు. టీమ్ వీడియోస్‌లో కూడా ఎక్కడా కనిపించలేదు.
అలాగే ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో కూడా ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ విషయంలో కాస్త అతిగా ప్రవర్తించాడు. చాలా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా.. రోహిత్‌ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ పెట్టాడు. ఆ తర్వాత గ్రౌండ్‌లో అతన్ని అటూ ఇటూ మార్చాడు. దీంతో.. రోహిత్ అభిమానులు పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్‌గా పాండ్యా చేసిన తప్పులు కూడా ముంబై అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దాంతో కాస్త వెనక్కి తగ్గిన పాండ్యా.. రోహిత్ శర్మతో మాట్లాడుతూ.. మ్యాచ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఫీల్డ్ సెట్ విషయంలో, అలాగే బౌలింగ్ మార్పుల విషయంలో రోహిత్‌తో చర్చించడంతో అభిమానులు కాస్త శాంతించారు. అయితే.. రోహిత్ శర్మ తనకు కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో కాస్త చిల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. అందుకే ఎప్పుడూ చాలా గంభీరంగా ఉండే రోహిత్ ఈ మధ్య ఫన్నీ ఫన్నీగా ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ టీమ్ బస్సుకు డ్రైవర్‌గా మారి.. తన అభిమానులకు తీస్తున్న ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటములతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్ తర్వాత రెండు వరుస విజయాలు సాధించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఆదివారం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియం వేదికగా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు ఐదేసి సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో రెండు ఛాంపియన్ టీమ్స్ మధ్య మ్యాచ్ కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌కి ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ బస్సుకు డ్రైవర్‌గా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma – A total fun character in life. 😄👌pic.twitter.com/W9SBJXhHdT
— Johns. (@CricCrazyJohns) April 13, 2024