SNP
Rohit Sharma, Yashasvi Jaiswal: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో చెలరేగడంతో.. వారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ కూడా మెరుగయ్యాయి. తాజా వారు ఏ ర్యాంక్‌లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Yashasvi Jaiswal: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో చెలరేగడంతో.. వారి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ కూడా మెరుగయ్యాయి. తాజా వారు ఏ ర్యాంక్‌లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో బిజీ ఉన్న రోహిత్ సేన.. రెండు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ, జైస్వాల్ డబుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు జైస్వాల్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి.. 15వ స్థానంలోకి చేరుకున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జైస్వాల్ సూపర్ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 80 పరుగులు చేసిన జైస్వాల్.. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. రెండో టెస్టులో టీమిండియా గెలిచిందంటే.. అందుకు కారణం జైస్వాలే. అలాగే తాజాగా ముగిసిన రాజ్‌కోట్ టెస్టులోనూ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇలా రెండు వరుస డబుల్ సెంచరీలతో సూపర్ కన్సిస్టేన్సీ చూపిస్తున్న జైస్వాల్.. టెస్ట్ ర్యాంక్ భారీగా మెరుగుపడింది. 29వ స్థానం నుంచి ఏకంగా 15వ స్థానానికి దూసుకొచ్చాడు. మిగిలిన రెండు టెస్టుల్లోనూ రాణిస్తే.. జైస్వాల్ ర్యాంక్ మరింత మెరుగుపడటం ఖాయం.
ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్ శర్మ మూడో టెస్టులో మాత్రం ఎంతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. 33 పరుగులకే 3 వికెట్లు పడిపోయి.. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిన క్లిష్టపరిస్థితుల్లో జడేజాతో కలిసి రోహిత్ భారీ భాగస్వామ్యం నమోదు చేసి.. టీమిండియాను మ్యాచ్‌లో నిలబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ ర్యాంక్ మెరుగుపడింది. అయితే.. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ అందరి కంటే టాప్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడకపోయినా.. కోహ్లీ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. పైగా టాప్ 10లో ఉన్న ఏకైక ఇండియన్ బ్యాటర్ కూడా కోహ్లీనే. మరి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్, జైస్వాల్ సత్తాచాటుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The highest-ranked India batters in the latest ICC Test rankings 🇮🇳🔝
Yashasvi Jaiswal is already climbing fast 🚀 pic.twitter.com/ftcXw1hFDN
— Sport360° (@Sport360) February 21, 2024