ఆసియా కప్-2023కు ముందు టీమిండియాపై ఎన్నో అనుమానాలు, సందేహాలు తలెత్తాయి. ఈ టీమ్‌ను సెలెక్ట్ చేశారేంటి? ఫలానా ప్లేయర్‌ను ఎందుకు పక్కన పెట్టారు? పాకిస్థాన్ లాంటి జట్టును మన టీమ్ ఎదుర్కోగలదా? అంటూ రకరకాలు ప్రశ్నలు వచ్చాయి. కానీ వీటన్నింటికీ భారత జట్టు వరుస విజయాలతో దిమ్మతిరిగే రీతిలో సమాధానం చెప్పింది. సూపర్-4లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలుపుతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్-4 దశలో తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో మాత్రం శ్రీలంకపై చెమటోడ్చి విజయం సాధించింది. ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న భారత్‌కు తదుపరి బంగ్లాదేశ్‌తో ఆడే మ్యాచ్ నామమాత్రం కానుంది.
ఇక, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన భారత సారథి రోహిత్ శర్మ లంక మీదా చెలరేగాడు. ఈ క్రమంలో మరో మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 10 వేల పరుగుల క్లబ్లో హిట్‌మ్యాన్ చేరాడు. ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ బ్యాటర్‌గా, పదిహేనో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఘనతను అందుకోవడానికి రోహిత్‌కు 214 ఇన్నింగ్స్‌లు అవసరం పడ్డాయి. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (205 ఇన్నింగ్స్‌లు) ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్‌లు), సౌరవ్ గంగూలీ (263 ఇన్నింగ్స్‌లు) కూడా ఈ లిస్టులో ఉన్నారు.
50 ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ శర్మ పదివేల పరుగుల క్లబ్లో చేరడంతో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ ఓల్డ్ న్యూస్ వైరల్ అవుతోంది. 11 ఏళ్ల కింద ఒక ఫంక్షన్లో సచిన్ టెండూల్కర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అప్పట్లో సచిన్ మాట్లాడుతూ.. తన రికార్డులను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే బ్రేక్ చేయగలరని అన్నాడు. సరిగ్గా పదకొండేళ్ల తర్వాత చూసుకుంటే పదివేల పరుగుల క్లబ్లో సచిన్‌ను రోహిత్, కోహ్లీలు వెనక్కి నెట్టేశారు. మాస్టర్ బ్లాస్టర్ కంటే ఈ ఇద్దరు ప్లేయర్లు తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే అరుదైన మైలురాయిని చేరుకున్నారు. దీంతో అప్పుడు సచిన్ చెప్పిన మాటల్ని రోహిత్, విరాట్ ఇప్పుడు నిజం చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.
Sachin Tendulkar in 2012: “Virat Kohli and Rohit Sharma are the ones who can break my record. I don’t mind as long as it’s an Indian.”
Virat Kohli became the fastest to score 10000 runs in ODIs and now Rohit Sharma has become the second fastest to reach the feat. pic.twitter.com/SEzdJ5xjvp
— Sameer Allana (@HitmanCricket) September 12, 2023