iDreamPost
android-app
ios-app

Rohit Sharma: కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు రోహిత్.. ఆ బాధలోనే..!

  • Published Dec 17, 2023 | 11:26 AM Updated Updated Dec 17, 2023 | 11:26 AM

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీ తర్వాత ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రవర్సీ తర్వాత ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చాడు.

  • Published Dec 17, 2023 | 11:26 AMUpdated Dec 17, 2023 | 11:26 AM
Rohit Sharma: కెప్టెన్సీ కాంట్రవర్సీ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు రోహిత్.. ఆ బాధలోనే..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది ఏదీ కలసి రావడం లేదు. కెరీర్​లో ఒక్కసారైనా వరల్డ్ కప్​ను ముద్దాడాలని అనుకుంటే అది తృటిలో చేజారింది. వన్డే ప్రపంచ కప్-2023 టోర్నమెంట్​లో ఫైనల్​ వరకు ఓటమి అనేదే లేకుండా దూసుకొచ్చిన భారత జట్టు.. తీరా తుదిపోరులో ఓడి కప్​ను మిస్ చేసుకుంది. ఓటమి బాధ మిగతా ప్లేయర్లు, అభిమానుల కంటే కూడా హిట్​మ్యాన్​కు మిగిల్చిన గాయం అంతా ఇంతా కాదు. ఇన్నాళ్లు పడిన శ్రమ అంతా బూడిద పాలవ్వడంతో రోహిత్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అద్భుతమైన బ్యాటింగ్​తో, బ్రిలియంట్ కెప్టెన్సీతో టీమ్​ను సూపర్బ్​గా నడిపించినా ఫైనల్​ ఓటమితో అంతా వృథా అయిపోయింది. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ విధ్వంసకర బ్యాటర్​కు ముంబై ఇండియన్స్ ఊహించని షాక్ ఇచ్చింది. తమ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన హిట్​మ్యాన్​ను కెప్టెన్సీ నుంచి తొలగించింది.

రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది ముంబై. అసలే వరల్డ్ కప్ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హిట్​మ్యాన్​ను ఇది మరింత ఆవేదనకు గురిచేసింది. ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన రోహిత్​లో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. తన కూతురు సమైరా చదువుకుంటున్న ధీరూబాయ్ అంబానీ స్కూల్ యానువల్ ఫంక్షన్​కు భార్య రితికా సజ్దేతో కలసి అటెండ్ అయ్యాడు హిట్​మ్యాన్. అయితే ఇటు రోహిత్​ ఫేస్​లో గానీ అటు రితికా ముఖంలో గానీ సంతోషం లేదు. ఇద్దరూ చాలా బాధలో కనిపించారు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్నవారిని నవ్వించే హిట్​మ్యాన్ ఇలా కనిపించేసరికి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అతడు ఈ బాధలో నుంచి త్వరగా బయటపడి.. మునుపటిలా హుషారుగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్కూల్ కార్యక్రమానికి వచ్చిన రోహిత్​ను చూస్తే ముంబై ఇచ్చిన షాక్ నుంచి అతడు కోలుకున్నట్లుగా కనిపించడం లేదు.

ఇన్నాళ్లూ ఒక బ్యాటర్​గా, కెప్టెన్​గా సేవలు అందించినా.. ఐదు ట్రోఫీలు అందించినా, ఎంతో లాయల్​గా ఉన్నా తన విషయంలో ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరు రోహిత్​ను తీవ్రంగా బాధించింది. అందుకే కెమెరా ముందుకు వచ్చినా అతడి ముఖంలో చిరునవ్వే లేదు. హిట్​మ్యాన్​తో పాటు అతడి భార్య రితికా సజ్దే కూడా శాడ్​గా కనిపించింది. దీన్ని బట్టే రోహిత్ ఫ్యామిలీని కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని చెప్పొచ్చు. కాగా, రోహిత్ గురించి చెబుతూ చెన్నై సూపర్ కింగ్స్ తమ ఇన్​స్టాగ్రామ్ హ్యాండిల్​లో పెట్టిన ఓ పోస్టుకు రితికా ఎల్లో కలర్​లోని లవ్ సింబల్​ను కామెంట్​గా పెట్టింది. దీంతో అతడు చెన్నైలోకి వెళ్తున్నాడని ఆమె హింట్ ఇచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ముంబై కెప్టెన్సీ మార్పు నిర్ణయం అటు అభిమానులతో పాటు ఇటు రోహిత్ శర్మను కూడా పర్సనల్​గా బాగా హర్ట్ చేసింది. దీని నుంచి అతడు ఎప్పుడు బయటపడతాడో చూడాలి. మరి.. రోహిత్​ను బాధపెడుతూ ముంబై తీసుకున్న నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్- హార్దిక్ మధ్య గొడవలు! అంతా పాండ్యా స్కెచ్ ప్రకారమే!