జైషాకు రీప్లేస్​మెంట్​గా సరైనోడే వస్తున్నాడు! ఎవరీ రోహన్ జైట్లీ?

Rohan Jaitley To Replace Jay Shah: భారత క్రికెట్ బోర్డు సెక్రెటరీ జైషా బీసీసీఐని వీడటం దాదాపు ఖాయంగా మారింది. దీంతో ఆయన పోస్టులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మాంది. షా వారసుడిగా ఒకరి పేరు బలంగా వినిపిస్తోంది.

Rohan Jaitley To Replace Jay Shah: భారత క్రికెట్ బోర్డు సెక్రెటరీ జైషా బీసీసీఐని వీడటం దాదాపు ఖాయంగా మారింది. దీంతో ఆయన పోస్టులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మాంది. షా వారసుడిగా ఒకరి పేరు బలంగా వినిపిస్తోంది.

భారత క్రికెట్ బోర్డులో హవా నడిపిస్తున్నాడు జైషా. సెక్రెటరీ పోస్టులో ఉన్న ఆయన ఏం చెబితే బోర్డులో అదే నడుస్తోంది. ఛైర్మన్​గా ఎవరు ఉన్నా షా మాటకు ఎదురుండదని అంటుంటారు. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్​గా పేరు తెచ్చుకున్న ఆయన.. మన దేశ క్రికెట్ వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకుంటూనే ఇతర దేశాలతోనూ మంచి సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నాడు. అలాంటి షా త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్​కు ఛైర్మన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 16 మంది సభ్యుల్లో 15 మంది ఆయనకే సపోర్ట్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 27న ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ అధికారిక నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ. కాబట్టి షా డెసిషన్ తీసుకోవడానికి ఇంకో 24 గంటల కంటే ఎక్కువ టైమ్ లేదు. ఆయన ఐసీసీకి వెళ్లిపోయే సూచనలు బలంగా కనిపిస్తుండటంతో బీసీసీఐలో షా పోస్ట్​లోకి వచ్చేదెవరు? అనే ప్రశ్న వస్తోంది.

జైషా వారసుడెవరు? అనేది భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ బీసీసీఐ సెక్రెటరీ ఎవరు? బోర్డులో చక్రం తిప్పే సత్తా ఎవరికి ఉంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో నలుగురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది రోహన్ జైట్లీ. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడే రోహన్ జైట్లీ. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆయన.. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్​గా తక్కువ టైమ్​లోనే క్రేజ్ సంపాదించారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోహన్ జైట్లీ. బీసీసీఐలో ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్​గా పని చేసిన అనుభవం ఉన్న ఆయనకు అక్కడి అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే జైషా ప్లేస్​లో రోహన్ బోర్డులోకి రావడం ఖాయమని అంటున్నారు.

సెక్రెటరీ పోస్టు కోసం రోహన్​ జైట్లీతో పాటు రాజీవ్ శుక్లా పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఆయన సెక్రెటరీ పోస్టులోకి వస్తే ఏడాది పాటు కంటిన్యూ అవ్వొచ్చు. గతంలో ఐపీఎల్ ఛైర్మన్​గా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ అవుతోంది. ఈ రేసులో ఆశిష్ షెలార్ పేరు కూడా వినిపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఈ బీజేపీ లీడర్​ బీసీసీఐ కోశాధికారిగా ఉన్నారు. మంచి అడ్మినిస్ట్రేటర్​గా పేరు తెచ్చుకున్న షెలార్​కు జైషా ఛెయిర్ దక్కే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ప్రస్తుత ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్​ ధుమాల్ కూడా ఈ రేసులో ఉన్నాడు. బోర్డు పెద్దలతో సత్సంబంధాలు ఉండటం, ఐపీఎల్ ఛైర్మన్​గా సక్సెస్ అవడం ఆయనకు కలిసొచ్చే అంశం. రేసులో ఉన్న నలుగురు కూడా బలమైన వ్యక్తులే. కాబట్టి జైషా వారసుడు ఎవరో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే రోహన్ జైట్లీ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో ఏం జరుగుతుందనేది బీసీసీఐ పెద్దల నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.

Show comments