iDreamPost
android-app
ios-app

అదో స్కామ్.. వాళ్లను అస్సలు నమ్మొద్దు! ఫ్యాన్స్​కు అశ్విన్ సూచన!

  • Published Aug 26, 2024 | 3:02 PM Updated Updated Aug 26, 2024 | 3:02 PM

Ravichandran Ashwin Criticizes Indigo Airlines: ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాను సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పడం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టైల్. మరో విషయంపై అతడు ఇలాగే రియాక్ట్ అయ్యాడు. వాళ్లను నమ్మొద్దంటూ ఫ్యాన్స్​కు సజెషన్ ఇచ్చాడు.

Ravichandran Ashwin Criticizes Indigo Airlines: ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాను సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పడం టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టైల్. మరో విషయంపై అతడు ఇలాగే రియాక్ట్ అయ్యాడు. వాళ్లను నమ్మొద్దంటూ ఫ్యాన్స్​కు సజెషన్ ఇచ్చాడు.

  • Published Aug 26, 2024 | 3:02 PMUpdated Aug 26, 2024 | 3:02 PM
అదో స్కామ్.. వాళ్లను అస్సలు నమ్మొద్దు! ఫ్యాన్స్​కు అశ్విన్ సూచన!

గ్రౌండ్​లో కూల్​గా, కామ్​గా ఉండే టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బయట కూడా అలాగే ఉంటాడు. నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తన చుట్టూ పాజిటివిటీ ఉండేలా చూసుకుంటాడు. అయితే అశ్విన్​లో మరో యాంగిల్ ఉంది. కూల్​గా కనిపించే అతడు.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాను సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పేస్తాడు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్​తో బాగా టచ్​లో ఉండే ఈ స్టార్ ప్లేయర్.. క్రికెట్​తో పాటు ఇతర విషయాల మీద కూడా తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటాడు. ఇదే క్రమంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మీద అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రయాణికులతో ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై అశ్విన్ సీరియస్ అయ్యాడు. ఇండిగో టికెట్ వ్యవస్థ సరిగ్గా లేదంటూ ఫైర్ అయ్యాడు.

ఇండిగో ఫ్లైట్ టికెట్స్ విషయంలో థర్డ్ పార్టీ బుకింగ్ ప్లాట్​ఫామ్​తో సమస్యలు వస్తున్నాయని అశ్విన్ అన్నాడు. ఇండిగో ఎయిర్​లైన్స్​లో ఇప్పుడు ఇది కామన్ అయిపోయిందన్నాడు. రీసెంట్​గా తనకు ఓ అనుభవం ఎదురైందన్న స్టార్ స్పిన్నర్.. వీళ్ల జోలికి వెళ్లకపోవడం బెటర్ అని సూచించాడు. కస్టమర్లతో తొలుత పేమెంట్ చేయించి.. ఆ తర్వాత వాళ్లకు నచ్చిన సీటింగ్​నే కేటాయిస్తాయన్నాడు అశ్విన్. మనం ఏది సెలెక్ట్ చేసినా వాళ్లు పట్టించుకోరని.. ఇది కూడా ఓ స్కామే కావొచ్చన్నాడు. ఇక మీదట వారిని నమ్మొద్దని సజెషన్ ఇచ్చాడు. పేమెంట్ చేసినా బ్లాక్ చేసిన సీట్లను మాత్రం ప్యాసింజర్లకు ఇవ్వరని.. అందుకే మీ టైమ్, ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దని ఓ పోస్ట్ పెట్టాడు అశ్విన్.

ఇండిగో ఎయిర్​లైన్స్​లో రీసెంట్​గా ఓ వృద్ధ దంపతులు టికెట్లు బుక్ చేశారు. కానీ వాళ్లకు రీజన్ చెప్పకుండా సీటింగ్ మార్చేశారు. నాలుగో వరుస నుంచి 19వ వరుసకు మార్చడంతో అక్కడికి వెళ్లేందుకు ఇరుకైన మార్గంలో ఆ వృద్ధ దంపతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని ఫేమస్ కామెంటేటర్ హర్షా భోగ్లే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తాను వెళ్తున్న ఫ్లైట్​లోనే ఈ ఘటన జరిగిందని తెలిపాడు. దీంతో ఇండిగో ఎయిర్​లైన్స్ టికెట్ బుకింగ్ సిస్టమ్ మీద అశ్విన్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. వాళ్లను నమ్మొద్దని.. అది స్కామ్ అంటూ సీరియస్ అయ్యాడు. గతంలో తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపాడు. ఈ కాంట్రవర్సీ మీద ఇండిగో ఇంకా స్పందించలేదు. మరి.. విమానాల్లో ప్రయాణించే సమయంలో సీటింగ్ కేటాయింపు విషయంలో మీరూ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.