టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురై.. మెగాటోర్నీలన్నింటికీ దూరం అయ్యాడు. ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురై.. మెగాటోర్నీలన్నింటికీ దూరం అయ్యాడు. ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదానికి గురై.. మెగాటోర్నీలన్నింటికీ దూరం అయ్యాడు. ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రీ ఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న పంత్.. మోకాలి సర్జరీ తర్వాత మునుపటి ఫిట్ నెస్ సాధించడంపై దృష్టిపెట్టాడు. అందులో భాగంగానే గ్రౌండ్ లో క్రికెట్ ఆడటం, జిమ్ లో కసరత్తులు చేయడం మెుదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక తనకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు ఈ డ్యాషింగ్ బ్యాటర్. తాజాగా మరో వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
రిషబ్ పంత్ టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. ఇప్పటికే జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసి.. ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ తన అప్డేట్స్ ను ఇస్తూ ఉన్నాడు. గతంలో జిమ్ లో బరువుతు ఎత్తుతూ, సైక్లింగ్ చేస్తున్న వీడియోలను షేర్ చేసిన పంత్.. తాజాగా మరో వీడియోను షేర్ చేశాడు. అయితే పోస్ట్ లో జీవితానికి సంబంధించిన ఓ కొటేషన్ కూడా జత చేశాడు ఈ బ్యాటర్. తాజాగా జిమ్ లో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోకు “జీవితంలో సాధించే విజయాలకు షార్ట్ కట్స్ ఉండవ్.. కేవలం కష్టం పడటమే” అన్న ఉద్దేశ్యంలో కొటేషన్ యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. టీమిండియా ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పంత్ రాక కోసం బీసీసీఐ కూడా ఎదురుచూస్తోంది. వచ్చే సంవత్సరం స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ నాటికి అతడిని సిద్దం చేయాలని చూస్తోంది. కాగా.. రిషబ్ పంత్ ప్రస్తుతానికి పూర్తిగా ఫిట్ నెస్ సాధించినట్లే కనిపిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. మరికొన్ని రోజుల్లో పంత్ ను టీమిండియా జెర్సీలో చూడొచ్చని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.