Nidhan
Rishabh Pant, IND vs BAN: స్టైలిష్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన బ్యాట్ పదును ఏంటో మరోమారు చూపించాడు. టెస్టుల్లో టీమిండియాకు తాను ఎంత కీలకమో ప్రూవ్ చేశాడు. చెన్నై టెస్టులో మార్వలెస్ సెంచరీతో చెలరేగిపోయాడు.
Rishabh Pant, IND vs BAN: స్టైలిష్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన బ్యాట్ పదును ఏంటో మరోమారు చూపించాడు. టెస్టుల్లో టీమిండియాకు తాను ఎంత కీలకమో ప్రూవ్ చేశాడు. చెన్నై టెస్టులో మార్వలెస్ సెంచరీతో చెలరేగిపోయాడు.
Nidhan
టీమిండియా తరఫున అదరగొడుతున్న సమయంలోనే కారు యాక్సిడెంట్‌కు గురయ్యాడో స్టార్ ప్లేయర్. ఘోర ప్రమాదం కారణంగా రెండేళ్లు ఆస్పత్రి బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇక అతడు కమ్‌బ్యాక్ ఇవ్వడం అయ్యే పనికాదని అంతా అనుకున్నారు. కానీ పట్టుదలతో లేచి నిలబడిన ఆ ఆటగాడు.. క్రమంగా నడక స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఫిట్నెస్, బ్యాటింగ్ టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవడంపై వర్క్ చేశాడు. అలా చాన్నాళ్లు కష్టపడి ఐపీఎల్లో ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికై.. భారత్ ఆ ట్రోఫీని గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అతడే రిషబ్ పంత్. ఈ స్టైలిష్ వికెట్ కీపర్ నమ్మశక్యం కాని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. రీఎంట్రీలో వన్డేలు, టీ20ల్లో అదరగొడుతున్న పంత్.. తనకు ఇంత ఫేమ్, క్రేజ్ తీసుకొచ్చిన టెస్టుల్లోనూ సత్తా చాటాడు. అయితే అతడి సక్సెస్‌లో ఆయుధ పూజది కీలక పాత్ర అని చెప్పొచ్చు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో వీరవిహారం చేశాడు పంత్. సెకండ్ ఇన్నింగ్స్‌లో 67 పరుగులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఔట్ అయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన పంత్ సూపర్బ్ ఇన్నింగ్స్‌తో టీమ్‌కు భారీ స్కోరు అందించాడు. శుబ్‌మన్ గిల్ (119)తో కలసి జట్టకు బిగ్ లీడ్ అందజేశాడు. 128 బంతుల్లో 109 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 13 బౌండరీలు, 4 భారీ సిక్సులు బాది బంగ్లాదేశ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అయితే పంత్ బ్యాటింగ్‌కు రాకముందు ఆయుధ పూజ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీఎంట్రీ తర్వాత ఫస్ట్ టెస్ట్ ఆడుతుండటంతో రాణించాలనే కసితో ఉన్న పంత్.. బ్యాటింగ్‌కు వచ్చే ముందు తన కిట్‌ను బయటకు తీశాడు. హెల్మెట్, గ్లవ్స్ సహా బ్యాట్ కూడా ఒక టేబుల్ మీద పెట్టాడు.
బ్యాట్ ముందు నిలబడి కాసేపు ప్రార్థన చేశాడు పంత్. తాను రాణించాలి, భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత దండం పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పంత్ పూజ చూసిన నెటిజన్స్.. సెంచరీలు ఊరికే రావని అంటున్నారు. అతడు చేసింది ఆయుధ పూజ అని, తనకు ఎంతో ముఖ్యమైన బ్యాట్‌కు అతడు దండం పెట్టి ప్రార్థించడం ఫలించిందని, అందుకే సెంచరీ బాదాడని చెబుతున్నారు. ఆయుధ పూజ అనేది మన కల్చర్‌లో ఒక భాగమని.. పంత్ దాన్ని ఫాలో అవడం మంచి విషయమని కామెంట్స్ చేస్తున్నారు. ఎంత నేమ్, ఫేమ్, క్రేజ్ వచ్చినా సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకపోవడం అద్భుతమని చెబుతున్నారు. అతడి బ్యాట్ నుంచి ఫ్యూచర్లో మరిన్ని సెంచరీలు రావడం ఖాయమని చెబుతున్నారు. మరి.. పంత్ ఆయుధ పూజపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Rishabh Pant doing Puja of his bat before going to batting 😭🤞🏻pic.twitter.com/gOXL01PR9i
— 𝓱 ¹⁷ 🇮🇳 (@twitfrenzy_) September 21, 2024