iDreamPost
android-app
ios-app

Virat Kohli: వీడియో: షకీబ్ గాలి తీసిన కోహ్లీ! విరాట్ కామెంట్​కు నవ్వాపుకోని బంగ్లా క్రికెటర్!

  • Published Sep 21, 2024 | 3:53 PM Updated Updated Sep 21, 2024 | 3:53 PM

Virat Kohli Hilarious Dig Shakib Al Hasan: విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గాలి తీసేశాడు. విరాట్ చేసిన ఆ కామెంట్ కు షకీబ్ సైతం నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Virat Kohli Hilarious Dig Shakib Al Hasan: విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గాలి తీసేశాడు. విరాట్ చేసిన ఆ కామెంట్ కు షకీబ్ సైతం నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Sep 21, 2024 | 3:53 PMUpdated Sep 21, 2024 | 3:53 PM
Virat Kohli: వీడియో: షకీబ్ గాలి తీసిన కోహ్లీ! విరాట్ కామెంట్​కు నవ్వాపుకోని బంగ్లా క్రికెటర్!

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే కొన్ని చిన్న చిన్న గొడవలు సైతం జరుగుతూనే ఉన్నాయి. పంత్ వర్సెస్ లిట్టన్ దాస్ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం తెలిసిందే. అలాగే రివ్యూ తీసుకోనందుకు రిషబ్ పంత్ కెప్టెన్ రోహిత్ శర్మకు, మహ్మద్ సిరాజ్ కు సారీ చెప్పాడు. ఇక మూడోరోజు ఆటలో బంగ్లాదేశ్ ఫీల్డ్ ను పంత్ సెట్ చేయడం, బంగ్లా కెప్టెన్ షాంటో కూడా అతడు చెప్పిన విధంగానే అక్కడ ఫీల్డర్ ను పెట్టడం జరిగింది. అయితే రెండో రోజు ఆటలో బంగ్లా సీనియర్ బౌలర్ షకీబ్ గాలి తీస్తూ.. కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

విరాట్ కోహ్లీ.. గ్రౌండ్ లోకి దిగితే ఎంత అగ్రెసీవ్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఎంత అగ్రెసీవ్ గా ఉంటాడో.. అంతే జోవియల్ గానూ ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించడంతో పాటుగా గ్రౌండ్ లో తన డ్యాన్స్ లతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. మెుత్తానికి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో ముందుంటాడు. తాజాగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో సైతం తన హాస్య చతురతను మరోసారి బయటపెట్టాడు. రెండో రోజు ఆటలో కోహ్లీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నాడు. అక్కడే మిడాన్ లో షకీబ్ అల్ హసన్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో “నువ్వేమైనా మలింగవా? యార్కర్ల మీద యార్కర్లు వేస్తున్నావు” అంటూ షకీబ్ వైపు చూస్తూ అన్నాడు. దానికి షకీబ్ పగలబడి నవ్వాడు. కోహ్లీ అలా అనే సరికి అతడికి ఏం చేయాలో అర్థం కాక.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కోహ్లీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించాడు.

అయితే అంతకు ముందు కోహ్లీకి వరుసగా యార్కర్లు వేయడంతో.. అతడి గాలి ఇలా తీసేశాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. కోహ్లీ ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. విరాట్ భాయ్ నీ కామెడీ టైమింగ్ కు హ్యాట్సాఫ్, నీ దెబ్బకు షకీబ్ కు నవ్వాలో.. ఏడవాలో తెలీలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 287 పరుగులకు డిక్లేర్ చేయడంతో.. బంగ్లా ముందు 515 పరుగుల టార్గెట్ ఉంది. ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ షాంటో(16), మోమినుల్ హక్(0) ఉన్నారు. మరి నువ్వు మలింగవా? అని షకీబ్ ను కోహ్లీ సరదాగా కామెంట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio