Rishabh Pant Bowling Final Over In DPL: వీడియో: ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టిన పంత్.. ఇది అస్సలు ఊహించలేదు!

వీడియో: ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టిన పంత్.. ఇది అస్సలు ఊహించలేదు!

Rishabh Pant Bowling In DPL: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త అవతారం ఎత్తాడు. ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Rishabh Pant Bowling In DPL: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త అవతారం ఎత్తాడు. ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గురించి తెలిసిందే. తనకు ఇచ్చిన రోల్​లో అదరగొడుతుంటాడీ యంగ్ క్రికెటర్. గ్రౌండ్​లో ఉన్నంత సేపు అందర్నీ ఎంటర్​టైన్ చేస్తుంటాడు. కీపింగ్​లో అద్భుతమైన స్టంపింగ్స్, రనౌట్స్​, డైవింగ్ క్యాచెస్​తో ఆడియెన్స్​ను మెస్మరైజ్ చేస్తాడు. అదే బ్యాటింగ్​లో అయితే రివర్స్ స్వీప్, సింగిల్ హ్యాండ్ షాట్స్​తో భారీగా పరుగులు రాబడుతుంటాడు. చూస్తుండగానే ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్​ను లాగేసుకుంటాడు. భారీ షాట్లతో మ్యాచ్​ను వన్ సైడ్ చేసేస్తాడు. అలాంటోడు తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. ప్యాడ్లు పక్కనబెట్టి బాల్ చేతబట్టాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న ఆడియెన్స్ షాకయ్యారు. వాళ్లు ఆశ్యర్యంలో ఉండగానే బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు పంత్.

ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో పంత్ బౌలర్ అవతారం ఎత్తాడు. సాధారణంగా కీపర్లు బౌలింగ్ చేయరు. కానీ పంత్ మాత్రం బాల్ చేతబట్టి యాక్షన్​లోకి దిగాడు. ఢిల్లీ సూపర్​స్టార్జ్-పురానీ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్​లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్​లో ఢిల్లీ సూపర్​స్టార్జ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన పురానీ ఢిల్లీ 197 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ స్కోరును ఇంకో 5 బంతులు ఉండగానే ఊదిపారేసింది ఢిల్లీ సూపర్​స్టార్జ్. పీయుష్ ఆర్య (57), ఆయుష్ బదోని (57) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మ్యాచ్​లో పంత్ టీమ్ ఓడింది. కానీ అతడు బౌలింగ్​కు దిగడం మాత్రం హైలైట్​గా నిలిచింది. ఎప్పుడూ చేయి తిప్పని పంత్.. తొలిసారి బౌలింగ్ చేశాడు. అయితే అతడు వేసిన ఫస్ట్ బాల్​కే ఢిల్లీ సూపర్​స్టార్జ్ నెగ్గడంతో ఓవర్ కంప్లీట్ చేసే ఛాన్స్ లభించలేదు. పంత్ బౌలింగ్ యాక్షన్ అందర్నీ ఆకట్టుకుంది. స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మాదిరిగా అతడి బౌలింగ్ యాక్షన్ అనిపించింది.

వార్న్​తో పాటు భారత వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్​తో పంత్ యాక్షన్ పోలికలు కనిపించాయి. సింపుల్​గా రెండు అడుగులు వేసి బౌలింగ్ యాక్షన్ ఫినిష్ చేశాడతడు. అతడి నుంచి మరిన్ని ఓవర్లు వస్తే గానీ బాల్​ను ఎంతవరకు టర్న్ చేయగలడు? పంత్ బౌలింగ్​కు పనికొస్తాడా? అనేది ఓ అంచనాకు రావొచ్చని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అయితే యాక్షన్ మాత్రం బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇక, గౌతం గంభీర్ హెడ్​ కోచ్​గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి భారత జట్టులో బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయడం చూస్తున్నాం. ఇప్పటికే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ తదితరులు ఈ పని చేశారు. గౌతీ అడగక ముందే పంత్ కూడా చేయి తిప్పడం విశేషం. మరి.. పంత్ బౌలింగ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments