iDreamPost
android-app
ios-app

Sachin Tendulkar: కోహ్లీ, స్మిత్ కాదు.. సచిన్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టేది జో రూట్: పాంటింగ్

  • Published Aug 16, 2024 | 8:52 AM Updated Updated Aug 16, 2024 | 8:52 AM

సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ రికార్డ్ ను విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ బ్రేక్ చేయలేరని, ఆ ఘనతను బద్దలు కొట్టే సత్తా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కు మాత్రమే ఉందని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు.

సచిన్ టెండుల్కర్ ఆల్ టైమ్ రికార్డ్ ను విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ బ్రేక్ చేయలేరని, ఆ ఘనతను బద్దలు కొట్టే సత్తా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కు మాత్రమే ఉందని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు.

Sachin Tendulkar: కోహ్లీ, స్మిత్ కాదు.. సచిన్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టేది జో రూట్: పాంటింగ్

సచిన్ టెండుల్కర్.. ఈ పేరు చెప్పగానే టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు గుర్తుకు వస్తాయి. తన బ్యాట్ తో ప్రపంచ క్రికెట్ ను ఏలిన రారాజు సచిన్. అందుకే అభిమానులు ముద్దుగా క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు. ఇక సచిన్ పేరిట ఎన్నో ఆల్ టైమ్ రికార్డ్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. దాంతో మిగిలిన ఘనతలను కూడా కోహ్లీనే బద్దలు కొడతాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్ మాత్రం ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మాస్టర్ బ్లాస్టర్ ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సచిన్ టెండుల్కర్ 200 టెస్ట్ మ్యాచ్ ల్లో 51 సెంచరీలతో 15, 921 పరుగులు చేశాడు. సచిన్ దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. ఇక టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగుల సచిన్ ఆల్ టైమ్ రికార్డ్ ను బ్రేక్ చేసే ఆటగాడు లేడనే చెప్పాలి. అయితే ఈ ఘనతను ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ కూడా ఈ రికార్డ్ ను బ్రేక్ చేయలేరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. జో రూట్ ఇటీవలే వెస్టిండీస్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో 12 వేల పరుగుల మార్క్ ను చేరుకున్నాడు. దాంతో మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్  జో రూట్ బ్రేక్ చేస్తాడని జోరుగా చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Sachin

“టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ ఆల్ టైమ్ రికార్డును జో రూట్ మాత్రమే బ్రేక్ చేయగలడు. ఎందుకంటే? రూట్ కు ఇప్పుడు 33 ఏళ్లు. పైగా 3 వేల పరుగులు మాత్రమే వెనకబడి ఉన్నాడు. అతడు సంవత్సరానికి 10 నుంచి 14 మ్యాచ్ లు ఆడి 800 నుంచి 1000 రన్స్ చేస్తే.. మరో మూడు లేదా నాలుగు ఏళ్లలో సచిన్ రికార్డ్ ను అందుకోగలడు. అయితే అతడు ఎన్ని మ్యాచ్ లు ఆడతాడు అనే దానిపైనే ఇది ఆధారపడి ఉంది. విరాట్ కోహ్లీ 8,848 పరుగులతో 19వ స్థానంలో ఉన్నాడు. దాంతో ఈ రికార్డ్ అతడు అధిగమించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇక స్మిత్ ది కూడా ఇదే పరిస్థితి” అంటూ చెప్పుకొచ్చాడు రికీ పాంటింగ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.