Somesekhar
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భారత దిగ్గజ క్రికెటర్లు అయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనిలను ఘోరంగా అవమానించాడు. దాంతో ఫ్యాన్స్ డీకేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ భారత దిగ్గజ క్రికెటర్లు అయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనిలను ఘోరంగా అవమానించాడు. దాంతో ఫ్యాన్స్ డీకేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే?
Somesekhar
మహేంద్రసింగ్ ధోని.. టీమిండియాకు 14 ఏళ్ల పాటు తన అమోఘమైన సేవలను అందించాడు. ఈ క్రమంలోనే మూడు ఐసీసీ ట్రోఫీలను కూడా భారత్ ఖాతాలో వేశాడు. మూడు ఫార్మాట్స్ లో కలిపి 15 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డ్స్ కలిగి ఉన్న ధోనిని దినేశ్ కార్తీక్ దారుణంగా అవమానించాడు. 78వ స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా భారత క్రికెటర్లతో తన ఆల్ టైమ్ జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో దిగ్గజాలు సౌరవ్ గంగూలీ మహేంద్రసింగ్ ధోనికి చోటు దక్కకపోవడం ఆశ్చర్యయం.
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆల్ టైమ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. మూడు ఫార్మాట్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఈ జట్టును ప్రకటించాడు. ఇందులో సచిన్, ద్రవిడ్, కుంబ్లేలతో పాటుగా కోహ్లీ, రోహిత్, బుమ్రాలు కూడా చోటు దక్కించుకున్నారు. కానీ అనూహ్యంగా ఆల్ టైమ్ గ్రేట్ టీమ్ లో ధోని ప్లేస్ ఇవ్వలేదు డీకే. భారత్ కు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన మహేంద్రుడికి ఈ జట్టులో ప్లేస్ దక్కకపోవడంతో అందరూ షాక్ కు గురౌతున్నారు. ఇంతటి దిగ్గజ ప్లేయర్ కు దినేశ్ కార్తీక్ తన జట్టులో స్థానం ఇవ్వకుండా అవమానించాడు అంటూ ధోని ఫ్యాన్స్ డీకేపై ఫైర్ అవుతున్నారు. అలాగే టీమిండియా భవిష్యత్ ను మార్చిన సౌరవ్ గంగూలీకి కూడా ఆల్ టైమ్ గ్రేట్ జట్టులో ప్లేస్ దక్కలేదు.
ఇక దినేశ్ కార్తీక్ ప్రకటించిన జట్టులో ఐదుగురు బ్యాటర్లు, ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు, మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లను తీసుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్-రోహిత్ శర్మలను ఓపెనర్లు తీసుకున్న డీకే.. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్, కోహ్లీలను మిడిలార్డర్ బ్యాటర్లుగా తీసుకున్నాడు. 12వ ప్లేయర్ గా హర్బజన్ ను తీసుకున్నాడు. అలాగే తన టీమ్ లో చాలా మంది దిగ్గజ ప్లేయర్లను తీసుకోలేదని, గౌతమ్ గంభీర్ కూడా ఈ జట్టులో సరిపోయే ప్లేయర్ అని డీకే పేర్కొన్నాడు.
సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, బుమ్రా, జహీర్ ఖాన్, (12వ ప్లేయర్ గా హర్బజన్ సింగ్ ను తీసుకున్నాడు).
Dinesh Karthik’s all time India XI (Cricbuzz):
1. Virender Sehwag.
2. Rohit Sharma.
3. Rahul Dravid.
4. Sachin Tendulkar.
5. Virat Kohli.
6. Yuvraj Singh.
7. Ravindra Jadeja.
8. Ravi Ashwin.
9. Anil Kumble.
10. Jasprit Bumrah.
11. Zaheer Khan. pic.twitter.com/ZLxXeeHFCf— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2024