Ricky Ponting: కోచ్ పాంటింగ్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. 6 ఏళ్ల ప్రయాణానికి..!

ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు హెడ్ కోచ్​గా ఉన్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ఆ జట్టుతో ప్రయాణిస్తూ వాళ్ల గెలుపోటముల్లో భాగంగా ఉన్నాడు.

ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు హెడ్ కోచ్​గా ఉన్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ఆ జట్టుతో ప్రయాణిస్తూ వాళ్ల గెలుపోటముల్లో భాగంగా ఉన్నాడు.

ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు హెడ్ కోచ్​గా ఉన్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ఆ జట్టుతో ప్రయాణిస్తూ వాళ్ల గెలుపోటముల్లో భాగంగా ఉన్నాడు. అలాంటోడ్ని ఉన్నపళంగా తొలగించింది డీసీ ఫ్రాంచైజీ. పాంటింగ్​తో తెగదెంపులు చేసుకుంది. కోచ్ బాధ్యతల నుంచి ఈ ఆసీస్​ లెజెండ్​ను తప్పిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది. మీ సేవలకు థ్యాంక్స్ అంటూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. తమతో పాంటింగ్ ఇక ప్రయాణించలేరనే వార్త చెప్పడం కష్టంగా ఉందని, కానీ ఇది నిజమని తెలిపింది. జట్టు విషయంలో ఆయన తీసుకున్న కేర్, చూపించిన కమిట్​మెంట్, యాటిట్యూడ్, ఆ ఎఫర్ట్స్​ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనంటూ డీసీ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

ఇన్నేళ్ల పాటు తమ టీమ్​ను సక్సెస్​ఫుల్​గా నడిపించిన పాంటింగ్ సేవలు అపూర్వమని ప్రశంసించింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఇన్ని సీజన్లలో ఏనాడూ ఆయన క్రమశిక్షణ తప్పలేదని, ఏ సెషన్​కైనా అందరి కంటే మొదట వచ్చి.. ఆఖర్లో వెళ్లేవాడని తెలిపింది. ఆయన స్ట్రాటజీలు అద్భుతమని కొనియాడింది. ఇక, పాంటింగ్ కోచ్​గా ఉన్న టైమ్​లో రెండు సార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయింది ఢిల్లీ జట్టు. 2020లో రన్నరప్​గా నిలిచింది. ఫైనల్​కు చేరుకున్నా కప్పును ఒడిసిపట్టలేకపోయింది. అయితే గత మూడు సీజన్లుగా ఆ టీమ్ దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చింది.

గత మూడేళ్లుగా ఢిల్లీ జట్టు లీగ్ స్టేజ్​కే పరిమితమవుతూ అభిమానులను డిజప్పాయింట్ చేసింది. రికీ పాంటింగ్​ను హెడ్ కోచ్​ బాధ్యతల నుంచి తప్పించడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఇక, డీసీ కొత్త కోచ్​గా లెజెండ్ సౌరవ్ గంగూలీని తీసుకోవడం పక్కా అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టుకు సలహాదారుగా ఉన్న దాదాను ఇప్పుడు పాంటింగ్ స్థానంలో రీప్లేస్ చేయడం ఖాయమని సమాచారం. అయితే దీనిపై డీసీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ ఏదీ చెప్పలేం. మరి.. పాంటింగ్​ను ఢిల్లీ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments