iDreamPost
android-app
ios-app

Shreyas Iyer: టీమిండియాలోకి శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. అంతా ప్లాన్ ప్రకారమే!

  • Published Jul 13, 2024 | 7:54 PM Updated Updated Jul 13, 2024 | 7:54 PM

స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. బీసీసీఐ అతడి కాంట్రాక్ట్​ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. బీసీసీఐ అతడి కాంట్రాక్ట్​ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  • Published Jul 13, 2024 | 7:54 PMUpdated Jul 13, 2024 | 7:54 PM
Shreyas Iyer: టీమిండియాలోకి శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. అంతా ప్లాన్ ప్రకారమే!

స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. బీసీసీఐ అతడి కాంట్రాక్ట్​ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడుతూనే వన్డే ప్రపంచ కప్-2023లో ఆడాడు అయ్యర్. మెగాటోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో ఆ ఏడాది ఐపీఎల్​ సీజన్​నూ వదిలేసుకున్నాడు. వరల్డ్ కప్​లో అద్భుతంగా బ్యాటింగ్​ చేసి అందర్నీ మెప్పించాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా సిరీస్​లోనూ పాల్గొన్నాడు. అలాగే ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లోనూ ఆడాడు. అయినా బోర్డు అతడి కాంట్రాక్ట్​ను రద్దు చేసింది. వెన్ను నొప్పి అని చెప్పిన అయ్యర్​ను ఎన్​సీఏకు పంపిన బోర్డు.. రికవర్ అయ్యాక రంజీల్లో ఆడమని ఆదేశించింది. అయితే గాయం మళ్లీ తిరగబెడుతుందనే భయంతో అతడు ఎన్​సీఏలోనే ఉండిపోయాడు.

ఫిట్​గా ఉన్నా రంజీల్లో ఆడకుండా తమ మాటల్ని బేఖాతరు చేశాడనే కారణంతో అయ్యర్ కాంట్రాక్ట్​ను బీసీసీఐ రద్దు చేసింది. అలాగే టీ20 వరల్డ్ కప్​కూ అతడ్ని సెలెక్ట్ చేయలేదు. అయితే కసిగా ఉన్న శ్రేయస్.. ఐపీఎల్​లో సూపర్ పెర్ఫార్మెన్స్​తో తన జట్టయిన కోల్​కతా నైట్ రైడర్స్​కు కప్పు అందించాడు. ఇప్పుడు కూడా టీమిండియాకు ఆడాలనే సంకల్పంతో మ్యాచులు లేకున్నా కఠోరంగా సాధన చేస్తున్నాడు. ఫిట్​నెస్​ను కాపాడుకోవడం, బ్యాటింగ్ టెక్నిక్​ను మెరుగుపర్చుకోవడంపై పని చేస్తున్నాడు. అయితే అయ్యర్ కష్టాలు తీరనున్నాయని తెలుస్తోంది. అతడ్ని టీమిండియాలోకి తీసుకొచ్చేందుకు కేకేఆర్ మాజీ మెంటార్, భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ జోరుగా ప్రయత్నిస్తున్నాడని సమాచారం.

ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వే టూర్​లో బిజీగా ఉంది. ఈ నెలాఖరులో శ్రీలంకతో సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్​లో ఆడే టీమ్​లోని హార్దిక్​ పాండ్యాకు రెస్ట్ ఇచ్చి.. అతడి స్థానంలో అయ్యర్​ను రీప్లేస్ చేయాలని గంభీర్ భావిస్తున్నాడట. ఐపీఎల్​తో పాటు వెంటనే వరల్డ్ కప్​లో ఆడిన హార్దిక్ బాగా అలసిపోయాడు. ఈ మధ్య గాయాల నుంచి రికవర్ అయిన అతడ్ని ఎక్కువ క్రికెట్ ఆడించడం సరికాదనే ఉద్దేశంతో విశ్రాంతి ఇవ్వాలని గౌతీ భావిస్తున్నాడట. అతడితో పాటు కీపర్ పంత్​కు కూడా రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అదే టైమ్​లో కేకేఆర్ కెప్టెన్ అయిన అయ్యర్​ను టీమ్​లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. హార్దిక్, పంత్​లో ఒక పొజిషన్​కు అయ్యర్​ను రీప్లేస్ చేయాలని డిసైడ్ అయ్యాడట. శ్రేయస్ రీఎంట్రీ కోసం సెలెక్టర్లను ఒప్పించే పనిలో ఉన్నాడట గంభీర్. అయితే అతడు జట్టులోకి వస్తాడా? లేదా? అనేది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. మరి.. అయ్యర్ రీఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet