iDreamPost
android-app
ios-app

టీమిండియా మ్యాచ్‌లు మళ్లీ ఎప్పుడు? 2024 డిసెంబర్‌ వరకు పూర్తి షెడ్యూల్‌ ఇదే!

  • Published Aug 09, 2024 | 4:40 PM Updated Updated Aug 09, 2024 | 4:40 PM

Team India, Schedule, BCCI: శ్రీలంకతో సిరీస్‌ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న టీమిండియా.. మళ్లీ గ్రౌండ్‌లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఎప్పుడు మళ్లీ మ్యాచ్‌లు మొదలు అవుతాయి? ఏ టీమ్స్‌తో ఏ సిరీస్‌లు ఉన్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Team India, Schedule, BCCI: శ్రీలంకతో సిరీస్‌ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న టీమిండియా.. మళ్లీ గ్రౌండ్‌లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఎప్పుడు మళ్లీ మ్యాచ్‌లు మొదలు అవుతాయి? ఏ టీమ్స్‌తో ఏ సిరీస్‌లు ఉన్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 09, 2024 | 4:40 PMUpdated Aug 09, 2024 | 4:40 PM
టీమిండియా మ్యాచ్‌లు మళ్లీ ఎప్పుడు? 2024 డిసెంబర్‌ వరకు పూర్తి షెడ్యూల్‌ ఇదే!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. టీమిండియా మూడు సిరీస్‌లు ఆడింది. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా జింబాబ్వేతో 5 టీ20 సిరీస్‌ ఆడింది. ఆ తర్వాత.. శ్రీలంక పర్యటనకు వెళ్లి సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో 3 టీ20ల సిరీస్‌, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 3 వన్డేల సిరీస్‌ ఆడింది. జింబాబ్వేపై 4-1తో, శ్రీలంకపై 3-0తో టీ20లు నెగ్గిన భారత జట్టు.. లంకపై మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ నెల 7న లంకతో చివరి వన్డే ముగిసింది. ఆ తర్వాత భాతర ఆటగాళ్లు ఇండియాకు వచ్చేశారు. అయితే.. మళ్లీ టీమిండియా ఎప్పుడు క్రికెట్‌ ఆడతుంది. ఏ టీమ్‌తో సిరీస్‌లు ఉన్నాయని క్రికెట్‌ అభిమానులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లకు ఫుల్‌ రెస్ట్‌ దొరికింది. ఎందుకంటే.. మరో 40 రోజుల వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. సెప్టెంబర్‌ 19 నుంచి మళ్లీ టీమిండియా బరిలోకి దిగనుంది. ఆ తర్వాత వరుసగా సిరీస్‌లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా.. ఇలా వరుసబెట్టి సిరీస్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌లో మొదలుపెడితే.. కంటిన్యూగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ బిజీ షెడ్యూల్‌తో క్రికెట్‌ అభిమానులకు పండగనే చెప్పాలి. మరి ఏ సిరీస్‌ ఎప్పుడుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

When are team india matches again

  • బంగ్లాదేశ్‌తో 2 టెస్టుల సిరీస్‌
    సెప్టెంబర్‌ 19-23: తొలి టెస్టు
    సెప్టెంబర్‌ 27-అక్టోబర్‌ 1 వరకు: రెండో టెస్ట్‌
  • బంగ్లాదేశ్‌తో 3 టీ20ల సిరీస్‌
    అక్టోబర్‌ 6: తొలి టీ20
    అక్టోబర్‌ 9: రెండో టీ20
    అక్టోబర్‌ 12: మూడో టీ20
  • న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌
    అక్టోబర్‌ 16-20: తొలి టెస్ట్‌
    అక్టోబర్‌ 24-28: రెండో టెస్ట్‌
    నవంబర్‌ 1-5: మూడో టెస్ట్‌
  • సౌతాఫ్రికాతో 4 టీ20ల సిరీస్‌
    నవంబర్‌ 8: తొలి టీ20
    నవంబర్‌ 10: రెండో టీ20
    నవంబర్‌ 13: మూడో టీ20
    నవంబర్‌ 15: నాలుగో టీ20
  • ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్‌
    నవంబర్‌ 22-26: తొలి టెస్టు
    డిసెంబర్‌ 6-10: రెండో టెస్టు
    డిసెంబర్‌ 14-18: మూడో టెస్టు
    డిసెంబర్‌ 26-30: నాలుగో టెస్టు
    జనవర్‌ 3, 2025 నుంచి 7వ తేదీ వరకు ఐదో టెస్టు.