బరువు పెరగడంలో వినేష్‌ ఫొగాట్‌దే తప్పు! మాకు సంబంధం లేదు: PT ఉష

బరువు పెరగడంలో వినేష్‌ ఫొగాట్‌దే తప్పు! మాకు సంబంధం లేదు: PT ఉష

PT Usha, Vinesh Phogat, Paris Olympics 2024: స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ బరువు పెరిగి డిస్‌క్వాలిఫై అవ్వడంలో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ తప్పు లేదని, అంతా వినేష్‌ ఫోగట్‌, ఆమె కోచ్‌దే తప్పు అంటూ పీటీ ఉష సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దాని గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

PT Usha, Vinesh Phogat, Paris Olympics 2024: స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ బరువు పెరిగి డిస్‌క్వాలిఫై అవ్వడంలో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ తప్పు లేదని, అంతా వినేష్‌ ఫోగట్‌, ఆమె కోచ్‌దే తప్పు అంటూ పీటీ ఉష సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దాని గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

100 గ్రాముల బరువు అధికంగా ఉందనే కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో ఫైనల్‌ చేరిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒలింపిక్స్‌ నిబంధనలతో పాటు.. వినేష్‌ ఫోగట్‌ బరువు పెరగకుండా చూసుకోలేదని.. భారత ఒలింపిక్‌ సంఘం, మెడికల్‌ టీమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా.. ఈ విమర్శలపై ఐఓఏ(ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌) ఛైర్‌పర్సన్‌ పీటీ ఉష స్పందించారు. బరువు పెరగడంలో వినేష్‌ ఫోగట్‌తో పాటు ఆమె వ్యక్తిగత కోచ్‌లు, సహాయక సిబ్బందిదే తప్పు అంటూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

వినేష్‌ ఫోగట్‌ బరువు పెరగడంలో ఐఓఏ మెడికల్‌ టీమ్‌ తప్పిదం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. మా మెడిలక్‌ టీమ్‌.. అథ్లెట్లు గాయపడితే.. వారు త్వరగా కోలుకునేలా చేస్తుందని, వారికి అవసరమైన వైద్య సాయం అందించడం, ఇంజూరీ మెనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తుంది తప్పా.. వారి బరువు, డైట్‌, ట్రైనింగ్‌ను పర్యవేక్షిందంటూ వెల్లడించారు. ఐఓఏ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దిన్షా పార్దివాలపై వచ్చిన విమర్శలను ఉష ఖండించారు. రెజ్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, జూడో వంటి వెయిట్‌ కేటగిరికి సంబంధించిన క్రీడల్లో అథ్లెట్లు, వారి కోచ్‌లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయని, బరువు, ఫిట్‌నెస్‌, డైట్‌ విషయంలో వారిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.

అయితే.. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో వినేష్‌ ఫోగట్‌ను డిస్‌క్వాలిఫై చేయడంతో ఆమె ఏ పతకం పొందకుండా అయింది. ఈ అంశంపై ఐఓఏ ఇప్పటికే కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. దీనిపిఐ ఈ నెల 13న తీర్పు రానుంది. ఈ క్రమంలోనే పీటీ ఉష.. వినేష్‌ విషయంలో తమ తప్పు లేదంటూ వెల్లడించారు. అలాగే కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌లో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఉష తెలిపారు. రూల్స్‌ ప్రకారం ఆడి ఫైనల్‌ వరకు చేరిన వినేష్‌ ఫోగట్‌కు కనీసం సిల్వర్‌ మెడల్‌ అయినా ఇవ్వాలని.. ఐఓఏ, స్పోర్ట్స్‌ కోర్టులో ఫైట్‌ చేసింది. మరి 13న కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. మరి వినేష్‌ ఫోగట్‌ బరువు పెరగడంలో తమ తప్పు లేదంటూ.. వినేష్‌, కోచ్‌లదే ఆ బాధ్యత అంటూ పీటీ ఉష చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments