రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ల రిటెన్షన్‌ను సద్వినియోగం చేసుకుంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి రూ.17 కోట్ల స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ల రిటెన్షన్‌ను సద్వినియోగం చేసుకుంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి రూ.17 కోట్ల స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకుంది.
వచ్చే నెల 19వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం జరగనుందనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న, వదులుకున్న, మార్చుకున్న ప్లేయర్ల లిస్టును ప్రకటించేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే గడువు నిర్ణయించారు. దీంతో ఈ టైమ్ ముగిసేలోపు ఆయా టీమ్స్ తన ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. అందరి కంటే ఎక్కువగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయం ఆసక్తిని రేకెత్తించింది. ముంబై ఇండియన్స్‌కు అతడు వెళ్లిపోతాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమవుతందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గత రెండు సీజన్లలో గుజరాత్‌ను ఫైనల్స్‌కు చేర్చడమే గాక, 2022లో ఆ టీమ్‌ను విజేతగానూ నిలిపిన హార్దిక్ ఫ్రాంచైజీ మార్పు అంశం సంచలనంగా మారింది. అయితే మొత్తానికి గాసిప్ నిజమైంది. పాండ్యా గుజరాత్ నుంచి ముంబైకి వెళ్లిపోయాడు. ఈ మేరకు ఆ రెండు టీమ్స్ మధ్య ఒప్పందం కుదిరింది.
నెక్స్ట్ సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను ఆడనున్నాడు. అతడి విషయంలో గుజరాత్‌తో ముంబై అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పాండ్యాకు ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనుంది ముంబై. అలాగే గుజరాత్‌కు ముంబై చెల్లించే భారీ మొత్తంలో 50 శాతం హార్దిక్‌కు దక్కనుంది. అయితే అది ఎంత మొత్తమో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముంబై జట్టులో మరో భారీ మార్పు చోటుచేసుకుంది. పాండ్యాను తెచ్చుకున్న ఈ ఫ్రాంచైజీ.. రూ.17.5 కోట్లు వెచ్చించి గత వేలంలో దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను వదులుకుంది. గ్రీన్‌ను ఆర్సీబీకి ఇచ్చేసిందా టీమ్. అయితే పాండ్యా, గ్రీన్ టీమ్ మార్పునకు బీసీసీఐ ఓకే చెప్పినప్పటికీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. హార్దిక్‌ను టీమ్‌లోకి తీసుకునేందుకు తగినంత డబ్బు లేకపోవడంతో ముందు గ్రీన్‌ను బెంగళూరుకు ఇచ్చేసింది ముంబై. ఆ తర్వాత గుజరాత్‌తో అగ్రిమెంట్ చేసుకుందని తెలుస్తోంది.
వచ్చే సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి ప్రక్షాళనకు దిగింది. బౌలింగ్ మీద స్పెషల్ ఫోకస్ చేసిన ఆర్సీబీ.. హసరంగ, హర్షల్ పటేల్, హేజల్‌వుడ్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్ లాంటి బౌలర్లను వదులుకుంది. వీళ్లను వదిలించుకోవడం ద్వారా ఫండ్స్‌ను రైజ్ చేసిన ఆర్సీబీ.. ఆ డబ్బులతో ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను దక్కించుకుంది. అతడు టీమ్‌లోకి రావడంతో అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్ కూడా మరింత బలపేతం కానుంది. గ్రీన్ కోసం ముంబైకి రూ.17.5 కోట్లు చెల్లించనుంది ఆర్సీబీ. ట్రేడింగ్‌లో ఎస్ఆర్హెచ్ నుంచి ఆల్‌రౌండర్ మయాంక్ డగర్ను కూడా దక్కించుకుందా ఫ్రాంచైజీ. ప్లేయర్ల ట్రేడింగ్ తర్వాత బెంగళూరు బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్, మయాంక్ డగర్ రూపంలో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌తో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మినీ వేలంలో మంచి బౌలర్లను దక్కించుకుంటే ఈసారి ఆర్సీబీకి తిరుగుండదనే చెప్పాలి. మరి.. ఆర్సీబీ లైనప్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: యశస్వి సూపర్ బ్యాటింగ్.. ఏకంగా రోహిత్ శర్మ రికార్డు బ్రేక్!
Cameron Green traded to RCB from MI. [Sports Tak] pic.twitter.com/g4oB5IGWAY
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
Mayank Dagar is thrilled to be a part of the RCB Red and Gold! 🤩
12th Man Army, Drop a welcome message for Mayank in the comments! 💬#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/Ypuv5QrDpi
— Royal Challengers Bangalore (@RCBTweets) November 27, 2023