SNP
Mayank Dagar, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ యంగ్ ప్లేయర్ సూపర్ ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, అతన్ని సరిగా వాడుకోకుండా ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ కుర్రాడు ఎవరు ఏంటో ఇప్పుడుచూద్దాం..
Mayank Dagar, IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ యంగ్ ప్లేయర్ సూపర్ ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, అతన్ని సరిగా వాడుకోకుండా ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ కుర్రాడు ఎవరు ఏంటో ఇప్పుడుచూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్‌కే సూపర్ స్టార్ట్‌ను అందుకుంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను చెన్నై బ్యాటర్లు 18.4 ఓవర్లో చేజ్ చేశారు. చెన్నై ఇంత సులువుగా గెలిచేందుకు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తీసుకున్న కొన్ని చెత్త నిర్ణయాలు కూడా కారణం. అలాగే ఆర్సీబీలో ఉన్న జూనియర్ యువరాజ్‌ను పూర్తి స్థాయిలో వాడుకోకపోవడం కూడా ఆర్సీబీ ఓటమికి కారణంగా నిలిచింది. ఆర్సీబీలో ఉన్న ఆ జూనియర్ యువీ ఎవరు? అతన్ని ఎలా వాడుకోలేకపోయారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ అద్భుతమైన భాగస్వామ్యంతో ఆర్సీబీకి ఊపిరపోశాడు. 6 వికెట్లు 90కి పైగా పరుగులు జోడించారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే.. 140కే పరిమితం అవుతుందనుకున్న ఆర్సీబీకి ఇది చాలా మంచి స్కోర్. 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్, రచిన్ రవీంద్ర మంచి స్టార్ ఇచ్చారు. రుతురాజ్ 15 రన్స్ చేసి అవుటైనా.. రచిన్ 37 రన్స్‌తో రాణించాడు.
ఆ తర్వాత వచ్చిన రహానే 19 బంతుల్లోనే 27 పరుగులు చేసి రాణించాడు. డారిల్ మిచెల్ కూడా 22 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో 110 పరుగుల వద్ద సీఎస్‌కే 4వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆర్సీబీ మ్యాచ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. అప్పటికీ సీఎస్‌కేకు విజయానికి 7 ఓవర్లలో 60 పరుగులు కావాలి. ఆర్సీబీ యువ స్పిన్నర్ మయాంక్ డాగర్‌ను ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అతనికి ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి. దీంతో.. మ్యాచ్ ఆర్సీబీ వైపు ఉన్నట్లు కనిపించింది. కానీ, డుప్లెసిస్ మాత్రం డాగర్‌తో మిగిలిన రెండు ఓవర్లు వేయించకుండా.. భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్, అల్జారీ జోసెఫ్ లాంటి బౌలర్లతో వేయించి.. మ్యాచ్‌ను ఆర్సీబీ చేతుల్లో పెట్టాడు.
ఆర్సీబీ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న మయాంక్ డాగర్ అనే కుర్రాడు సీఎస్‌కే ఆన్నింగ్స్ ఆరంభంలో సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని ఫీల్డింగ్‌కు కోహ్లీ సైతం ఫిదా అయిపోయాడు. ఆ ఫీల్డింగ్ చూస్తూ యువరాజ్ సింగ్ గుర్తుకు వచ్చాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అలాగే స్పిన్ బౌలింగ్ కూడా సూపర్‌గా వేశాడు. అతను వేసిన రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాంటి బౌలర్‌తో పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయించకుండా ఆర్సీబీ కెప్టెన్ చాలా పెద్ద తప్పు చేశాడు. అందుకే జూనియర్ యువరాజ్ సింగ్ లాంటి బౌలర్ జట్టులో ఉన్నా.. సరైన విధంగా అతన్ని పూర్తి స్థాయిలో వాడుకోకుండా ఆర్సీబీ ఓటమి పాలైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli handed the RCB debut cap to Mayank Dagar. pic.twitter.com/8t6OewoKLm
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024
Mayank Dagar turns up the swag meter 📈
A true all-rounder! 💪#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/2TqyAomtWI
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 21, 2024
Chennai Pitch is going to be Spin friendly 💫❤️ and we don’t have quality Spinners.
There will be a heavy Load on Himanshu & Mayank Dagar. From Himanshu you cannot expect much. He’s Young and hasn’t played even Domestic Cricket. pic.twitter.com/q7bwcVfSdp
— CHIKU JI❤️💫 (@MaticKohli251) March 20, 2024
RCB will drop #MayankDagar next match 😂😂😂
Best bowler got only 2 overs.
RCB never play to win matches. pic.twitter.com/zW5MuSUTeM— Old Monk (@mroldmonkk) March 23, 2024