SNP
RCB, Vizag: ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఆర్సీబీ. అలాంటి టీమ్ ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు అలా జరుగుతుందో? దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
RCB, Vizag: ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఆర్సీబీ. అలాంటి టీమ్ ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు అలా జరుగుతుందో? దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఎప్పటిలాగే ఈ సీజన్ కోసం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిటింగ్. అయితే… ఈ సారి సీజన్‌కు పార్లమెంట్ ఎన్నికలు కాస్త అడ్డుతగిలేలా ఉన్నాయి. ఇదే ఏడాది లోక్‌సభ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని మాత్రమే విడుదల చేసింది. లోక్‌సభ్ ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది బీసీసీఐ. అయితే.. ఈ క్రమంలోనే ఆర్సీబీ మ్యాచ్‌లకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 16 సీజన్లు జరిగాయి. 2008 నుంచి 2023 వరకు జరిగిన సీజన్లలో ఒక్క సారి కూడా కప్పు కొట్టని జీరో కప్ టీమ్స్‌లో ఆర్సీబీ ఒకటి. అయినా కానీ, ఆ టీమ్ భారీ ఫాలోయింగ్ ఉంది. పాపులారిటీ, క్రేజ్‌లో ఐపీఎల్‌లోని మిగతా టీమ్స్ కంటే ఆర్సీబీనే టాప్‌లో ఉంటుంది. విరాట్ కోహ్లీ కారణంగానే ఆర్సీబీకి అంత క్రేజ్ వచ్చింది. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఆర్సీబీకి ఫ్యాన్స్ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్సీబీకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. హోం టీమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కూడా కాదని ఆర్సీబీకి సపోర్ట్ చేసే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. రానున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్సీబీ తమ హోం గేమ్ మ్యాచ్‌లన్నీ వైజాగ్‌లోనే ఆడనున్నట్లు తెలుస్తోంది. అదేంటి ఆర్సీబీ హోం గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కదా.. వైజాగ్‌లో ఎందుకు ఆడుతుందనే డౌట్ రావొచ్చు. దానికి ఓ బలమైన కారణం ఉంది.
ప్రస్తుతం బెంగళూరు సిటీలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తింది. తాగు నీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో ట్యాకర్ నీటిని రూ.2000 నుంచి రూ.3000 వేల వరకు పెట్టి కొనుగోలు చేసి.. బిందెలు, క్యాన్ల లెక్కన కూడా అమ్ముతున్నారు. ఈ నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే ఆర్సీబీ మ్యాచ్‌లను వైజాగ్ తరలించాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒక వేళ బెంగళూరు నుంచి మ్యాచ్‌లను తరలిస్తే.. వైజాగ్ అయితే బెటర్ ఆప్షన్ అని కూడా కేసీఏ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆర్సీబీ మ్యాచ్‌ల నుంచి వైజాగ్‌లో జరిగితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝐓𝐇𝐈𝐒 𝐈𝐒 𝐈𝐓 🤩
For every role, we’ve found our match
And we believe they can hit the Purple Patch!
Signed today or retained before,
This is our #𝗖𝗹𝗮𝘀𝘀𝗢𝗳𝟮𝟬𝟮𝟰#PlayBold #BidForBold #IPLAuction #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/5bskDt4eGa— Royal Challengers Bangalore (@RCBTweets) December 19, 2023