SNP
RCB, IPL 2024: ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఆర్సీబీ.. కానీ, ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. కానీ, ఈ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక కొత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
RCB, IPL 2024: ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఆర్సీబీ.. కానీ, ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. కానీ, ఈ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక కొత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలిచితీరాల్సిన మ్యాచ్‌ల్లో ఆర్సీబీ తమ బెస్ట్‌ను బయటికి తీస్తోంది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ సీజన్‌లో చాలా రోజులుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆర్సీబీ ఎట్టకేలకు తమ స్థానాన్ని కాస్త మెరుగుపర్చుకుని.. 7వ స్థానానికి చేరుకుంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కూడా గెలిస్తే.. ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. అయితే.. నిన్నటి మ్యాచ్‌తో ఆర్సీబీ ఒక కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లోనే తమ 17 ఏళ్ల చరిత్రలో ఆర్సీబీ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డంతో 6 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.
గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఆర్సీబీ మెరుపు వేగంతో ఆరంభించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రెండు భారీ సిక్సులతో ఊహించని స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్ అయితే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు జెట్ స్పీడ్‌తో చెలరేగడంతో.. పరుగుల వరద పారింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడాలంటే.. మెరుగైన రన్‌రేట్ ఉంటే మంచిదని ఆర్సీబీ ఓపెనింగ్ జోడీ డిసైడ్ అయి.. వీలైనన్ని తక్కువ ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేయాలని బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లే పవర్ ప్లేలో అద్భుతమైన బ్యాటింగ్‌తో 92 రన్స్ చేశారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆర్సీబీకి పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్. డుప్లెసిస్ 23 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సులతో 64 పరుగులు చేసి అదరగొట్టాడు. అలాగే విరాట్ కోహ్లీ 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో 42 పరుగులు చేసి రాణించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. గుజరాత్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్ 37, డేవిడ్ మిల్లర్ 30, రాహుల్ తెవాటియా 35 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాళ్, వైశాఖ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కామెరున్ గ్రీన్, కరణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక 148 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదిపారేసింది. ఓపెనర్లు డుప్లెసిస్, కోహ్లీ తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించి విజయం ఖాయం చేశారు. కానీ, డుప్లెసిస్ అవుటైన వెంటనే వరుసగా 6 వికెట్లు పడటంతో మ్యాచ్ కాస్త రసవత్తరంగా మారింది. 92 వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 117 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. కానీ, చివర్లో దినేష్ కార్తీక్ 21, స్వప్నిల్ సింగ్ 15 పరుగులు చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. మరి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సాధించిన పవర్‌ప్లే రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Highest powerplay scores in the IPL:
125/0 – SRH vs DC, 2024
105/0 – KKR vs RCB, 2017
100/2 – CSK vs PBKS, 2014
93/1 – PBSK vs KKR, 2024
92/2 – DC vs SRH, 2024
92/1 – RCB vs GT, 2024 pic.twitter.com/Myl7iaedXa— CricTracker (@Cricketracker) May 4, 2024