R Ashwin: యువ క్రికెటర్లకు అశ్విన్ వార్నింగ్! వాళ్లపై అతిగా ఆధారపడొద్దంటూ..

Ravichandran Ashwin, Team India: ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబుతుంటాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. యంగ్ క్రికెటర్ల విషయంలోనూ అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ravichandran Ashwin, Team India: ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెబుతుంటాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. యంగ్ క్రికెటర్ల విషయంలోనూ అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంత కష్టపడ్డాడో తెలిసిందే. ఒకప్పుడు జట్టులో చోటు కష్టమనే స్థాయి నుంచి త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా ఎదిగాడు. టెస్టుల్లో దిగ్గజ స్థాయిని అందుకున్నాడు. వికెట్లు పడకపోయినా, పరుగులు భారీగా ఇచ్చుకున్నా వెరవకుండా తన బౌలింగ్ ను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ వచ్చాడు. ఒక్కో మ్యాచ్ ను సవాల్ గా తీసుకొని ఆడుతూ పోయాడు. భారత ఉపఖండంతో పాటు ఫారెన్ కంట్రీస్ లోనూ వికెట్లు తీస్తూ గ్రేట్ స్పిన్నర్ గా ఎదిగాడు. తనలాగే ఇతరులు కష్టపడితే ఈ స్థాయిని అందుకోవచ్చని అంటున్నాడు అశ్విన్. అయితే అందుకు ఎంతో శ్రమించాలని చెబుతున్నాడు. సేమ్ టైమ్ వాళ్లపై అతిగా ఆధారపడొద్దంటూ యంగ్ క్రికెటర్స్ కు వార్నింగ్ ఇస్తున్నాడు.

కెరీర్ లో ఎదగాలంటే సొంత బలాలు, బలహీనతల మీద ఫోకస్ పెట్టాలని కుర్ర క్రికెటర్లకు అశ్విన్ సూచించాడు. కోచ్ ల మీద అతిగా ఆధారపడటం మంచిది కాదని.. అలా చేస్తే కొత్తగా ఆలోచించడం మానేసి ఒక్కచోటే ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అవతలి వ్యక్తులకు ఇష్టం లేకపోయినా నేర్చుకునే సాకుతో అతుక్కుపోవడం తనకు నచ్చదని, తనలో ఆ గుణం లేదన్నాడీ టాప్ స్పిన్నర్. కోచ్ ల వద్ద శిక్షణ పొందడం తప్పు అని లేదా అలా ట్రెయినింగ్ తీసుకున్న వారు బాగుపడరని తాను చెప్పడం లేదన్నాడు అశ్విన్. కానీ కోచ్ ల మీద ఎక్కువగా ఆధారపడితే గ్రోత్ ఉండదని, దీని వల్ల చాలా చోట్ల వెనుకబడిపోతారన్నాడు. యంగ్ క్రికెటర్లు ఈ విషయంలో ఒకసారి పునరాలోచించుకోవడం బెటర్ అని సూచించాడీ సీనియర్ స్పిన్నర్.

‘కొందరు ఆటగాళ్లు కోచ్ లు, మెంటార్లపై అతిగా ఆధారపడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది డేంజరస్ కల్చర్. ఇతరులను ఎక్కువగా నమ్ముకునే వారు సొంతంగా, కొత్తగా ఆలోచించడం మర్చిపోతారు. మామూలుగా ఏ కోచ్ అయినా ప్లేయర్ కు ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఒకరికి పనిచేసిన ఫార్ములా మరొక ఆటగాడికి పని చేయదు. కానీ మోడర్న్ కోచింగ్ లో దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. డౌట్స్ వస్తే ఇతరుల సలహా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ నీ గేమ్ మీద నీకు అవగాహన లేకపోతే నీ లోపాలు నీవే గుర్తించలేకపోతే చాలా కష్టం’ అని అశ్విన్ స్పష్టం చేశాడు. భారత కొత్త కోచ్ గౌతం గంభీర్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్నాడు అశ్విన్. గౌతీతో కలసి వర్క్ చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. మరి.. కోచ్ లపై అతిగా ఆధారపడొద్దంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments