Somesekhar
టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ రవిశాస్త్రి భారత యంగ్ ప్లేయర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఆడకపోతే.. పుజారా వెయింటిగ్ చేస్తున్నాడు నీ ప్లేస్ కోసం అంటూ హెచ్చరించాడు.
టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ రవిశాస్త్రి భారత యంగ్ ప్లేయర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఆడకపోతే.. పుజారా వెయింటిగ్ చేస్తున్నాడు నీ ప్లేస్ కోసం అంటూ హెచ్చరించాడు.
Somesekhar
ప్రస్తుతం టీమిండియాలో యువ రక్తం ఉరకలు పెడుతోంది. దీంతో సీనియర్లు అయిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహనేలు జట్టులో చోటుకోల్పోయారు. వారి స్థానాల్లో టీమ్ లోకి అడుగుపెట్టిన యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో.. సీనియర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే ఓ యువ ఆటగాడికి ఎన్ని ఛాన్స్ లు ఇచ్చినా గానీ.. గత కొంతకాలంగా విఫలం అవుతూనే ఉన్నాడు. దీంతో భారత దిగ్గజ ప్లేయర్ రవిశాస్త్రి ఆ యువ ఆటగాడికి వార్నింగ్ ఇచ్చాడు. పుజారా నీ ప్లేస్ కు ఎసరుపెట్టడానికి ఎదురుచూస్తున్నారు గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరి ఆ యంగ్ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం టీమిండియాలో దారుణంగా విఫలం అవుతున్న ఆటగాడు ఎవరు? అంటే వెంటనే అందరు చెప్పే ఒకే ఒక్క పేరు శుబ్ మన్ గిల్ అనే. గత కొంతకాలంగా అతడి స్కోర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. గత పది ఇన్నింగ్స్ ల్లో అతడి అత్యధిక స్కోర్ 36 పరుగులు అంటే మీరు నమ్ముతారా? దీంతో గిల్ పై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో సైతం గిల్ విఫలం అయ్యాడు. కేవలం 34 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరిన్ని విమర్శలకు కేంద్ర బిందువుగా మారాడు.
ఇదిలా ఉండగా.. గిల్ కు వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, దిగ్గజ ప్లేయర్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు రవిశాస్త్రి. ఈ సందర్భంగా గిల్ కు వార్నింగ్ ఇచ్చాడు. అవతల సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా వెయిట్ చేస్తున్నాడు జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. “ప్రస్తుతం టీమిండియాలో యువ రక్తం ఉరకలేస్తోంది. వీరు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సత్తా నిరూపించుకోవాలి. లేదంటే సీనియర్ ప్లేయర్లు అయిన పుజారా, రహనేలు జట్టులోకి రావొచ్చు. మరీ ముఖ్యంగా పుజారా రంజీల్లో అదరగొడుతున్నాడు. దీంతో అతడు ఎప్పుడైనా జట్టులోకి రావొచ్చు. ఈ విషయాన్ని గిల్ అర్దం చేసుకోవాలి. లేదంటే జట్టులో ప్లేస్ కోల్పోవాల్సి వస్తుంది” అంటూ హెచ్చరికలు జారీ చేశాడు రవిశాస్త్రి.
కాగా.. గిల్ షాట్ సెలెక్షన్ పై కూడా రవిశాస్త్రి స్పందించాడు. షాట్ సెలెక్షన్ విషయంలో గిల్ జాగ్రత్తగా ఉండాలని, లేదంటే భారీ ఇన్నింగ్స్ లు ఆడలేడని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు సీనియర్ ప్లేయర్ పుజారా. ఈ సీజన్ లో బ్యాట్ తో చెలరేగుతున్నాడు నయా వాల్. జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో 243 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా మ్యాచ్ ల్లోనూ కంటిన్యూస్ గా పరుగులు సాధిస్తూ.. ఎప్పుడెప్పుడు టీమిండియా నుంచి పిలుపు వస్తుందా? బరిలోకి దిగుదామా.. అని ఎదురుచూస్తున్నాడు. ఇదే విషయాన్ని గిల్ కు వార్నింగ్ రూపంలో చెప్పాడు రవిశాస్త్రి. మరి గిల్ కు రవిశాస్త్రి వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravi Shastri speaks… pic.twitter.com/2GKPlHk1t2
— RVCJ Media (@RVCJ_FB) February 2, 2024
ఇదికూడా చదవండి: Sunil Gavaskar: సునీల్ గవాస్కర్ ఇంట తీవ్ర విషాదం.. కామెంట్రీ మధ్యలోనే ఇంటికి!