Ravi Shastri: నా జీవితంలో ఎన్నో చూశాను.. కానీ, బెస్ట్‌ అదే! రవిశాస్త్రి ఎమోషనల్‌

రవిశాస్త్రి.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాజీ క్రికెటర్‌గా, టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌గా ఈ రెండింటికి మించి ఒక కామెంటేటర్‌గా రవిశాస్త్రికి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. రవిశాస్త్రి ఒక విజయంపై ఎమోషనల్‌ అయ్యారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రవిశాస్త్రి.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాజీ క్రికెటర్‌గా, టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌గా ఈ రెండింటికి మించి ఒక కామెంటేటర్‌గా రవిశాస్త్రికి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే.. రవిశాస్త్రి ఒక విజయంపై ఎమోషనల్‌ అయ్యారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా మాజీ క్రికెటర్‌, మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి బీసీసీఐ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన బీసీసీఐ నమన్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలో రవిశాస్త్రికి ఈ అవార్డును అందజేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్ని, సెక్రటరీ జైషా చేతుల మీదుగా రవిశాస్త్రి ఈ అవార్డును అందుకున్నారు. అయితే.. ఈ అవార్డు అందుకుంటున్న సమయంలో రవిశాస్త్రి కాస్త ఎమోషనల్‌ అయ్యారు. ఆయన ఎమోషనల్‌ అవ్వడమే కాకుండా అక్కడున్న వారికి కూడా ఎమోషనల్‌ చేశారు. ఈ మెడల్‌ కంటే కూడా గొప్ప మెడల్‌ తనకు ఒకటి ఉందని ఆయన వెల్లడించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

అవార్డ్‌ ప్రదానం చేసే సమయంలో హోస్ట్‌ హర్షాభోగ్లే మాట్లాడుతూ.. మీ జీవతంలో మర్చిపోలేని ఒక గొప్ప అచీవ్‌మెంట్‌, నిద్రలోంచి లేచినా.. అదొక్కటి చాలా జీవితానికి అనిపించే సంఘటన, సాధించిన విజయం ఏదైనా ఉందా అని అడగ్గా దానికి రవిశాస్త్రి తనదైన స్టైల్‌లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘1985లో ఇండియా-పాకిస్థాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజయం చూశాను, అలాగే 1983లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నా.. అలాగే కామెంటేటర్‌గా 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోని కొట్టిన సిక్స్‌కు సాక్ష్యంగా నిలిచా.. 2007లో ఇండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడం కూడా ఆస్వాదించా.. కానీ, వీటన్నింటికి మించి.. ఒక్క విజయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.

అదే 2021లో ఆస్టేలియాలోని గాబాలో సాధించిన విజయం. రిషభ్‌ పంత్‌ ఇండియాను విజయతీరాలకు చేర్చి, భారత్‌ చరిత్ర సృష్టించేలా చేసిన ఆ క్షణం తన జీవితంలో మధురమైన క్షణమని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఆ సయమంలో ఆయనే టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా ఉన్నారు. కాగా, ఆ మధుర క్షణాల గురించి చెబుతూ.. రవిశాస్త్రి తనదైన కామెంటరీ శైలిలో చెబుతుంటే.. ఆ హాల్‌ మొత్తం చప్పట్లో మారుమోగిపోయింది. ఇప్పటికీ ఆ వీడియో చూస్తుంటే.. తమ గూస్‌బమ్స్‌ వస్తున్నాయంటూ క్రికెట్‌ అభిమానులు సైతం కామెంట్‌ చేస్తున్నారు. మరి కిందున్న ఆ వీడియో చూపి.. మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments