iDreamPost
android-app
ios-app

IPL 2024: ముంబై ఇండియన్స్‌లోకి రషీద్‌ ఖాన్‌! ఆకాశ్‌ అంబానీ డీల్‌ ఫిక్స్‌ చేశాడా?

  • Published Mar 25, 2024 | 7:45 PM Updated Updated Mar 25, 2024 | 7:45 PM

రషీద్‌ ఖాన్‌ను ముంబై ఇండియన్స్‌లోకి తీసుకురావాలని ఆకాశ్‌ అంబానీ భావిస్తున్నట్లు, అందుకే అతనితో మ్యాచ్ అనంతరం చాలాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ న్యూస్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

రషీద్‌ ఖాన్‌ను ముంబై ఇండియన్స్‌లోకి తీసుకురావాలని ఆకాశ్‌ అంబానీ భావిస్తున్నట్లు, అందుకే అతనితో మ్యాచ్ అనంతరం చాలాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ న్యూస్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Published Mar 25, 2024 | 7:45 PMUpdated Mar 25, 2024 | 7:45 PM
IPL 2024: ముంబై ఇండియన్స్‌లోకి రషీద్‌ ఖాన్‌! ఆకాశ్‌ అంబానీ డీల్‌ ఫిక్స్‌ చేశాడా?

ఐపీఎల్‌ 2024లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో కూడా ఊహించని ఫలితం వచ్చింది. మ్యాచ్‌ 75 శాతం పూర్తి అయ్యే వరకు ముంబై ఇండియన్స్‌ చాలా ఈజీగా ఈ మ్యాచ్‌ గెలుస్తుందని అనిపించింది. కానీ, చివర్లో గుజరాత్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి ఓవర్‌ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనల ఆధారంగా ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న రషీద్‌ ఖాన్‌.. వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడతాడనే టాక్‌ వినిపిస్తోంది.

గుజరాత్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ తర్వాత ఇరు జట్లు ఆటగాళ్లు మాట్లాడుకోవడం సాహజం. అలాగే ఆయా జట్ల ఓనర్లు కూడా ఆటగాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌ ఓనర్‌ ఆకాశ్‌ అంబానీ.. గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌తో చాలా సేపు మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆదివారం మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ గెలవాడనికి రషీద్‌ ఖాన్‌ కూడా ప్రధాన కారణం. పైగా యూఏఈ లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ తరఫున రషీద్‌ ఖాన్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో సరైన స్పిన్నర్‌ లేడు. అందుకే రషీద్‌ ఖాన్‌ను ముంబై ఇండియన్స్‌లోకి తీసుకురావాలని ఆకాశ్‌ అంబానీ భావిస్తున్నట్లు అందుకే అతనితో చాలాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం ఎలాగో మెగా వేలం జరుగుతుంది. ఆ వేలంలో లేదా వేలానికంటే ముందే ఇంటర్నల్‌ క్యాష్‌ ట్రెడింగ్‌లో రషీద్‌ ఖాన్‌ను తీసుకోవాలని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం భావిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రషీద్‌ ఖాన్‌తో ఆకాశ్‌ అంబానీ సుదీర్ఘంగా చర్చలు జరగపడంతో ఈ వార్తలుకు బలం చేకూరుస్తోంది. గతంలో గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న హార్థిక్‌ పాండ్యాను కూడా ఇలాగే మ్యాచ్‌ తర్వాత మాట్లాడి.. ముంబై ఇండియన్స్‌లోకి మళ్లీ తీసుకొచ్చాడు ఆకాశ్‌ అంబానీ. ఇప్పుడు రషీద్‌ ఖాన్‌తో సేమ్‌ డీల్‌ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: MI vs GT: స్టేడియంలో పొట్టుపొట్టు కొట్టుకున్న రోహిత్‌-పాండ్యా ఫ్యాన్స్‌!

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş