Bhuvneshwar Kumar: భువీ సూపర్ బౌలింగ్.. ఒక్క ఓవర్​తో సెలక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్!

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టాలెంట్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ఈ వెటరన్ పేసర్ మరోమారు సూపర్ బౌలింగ్​తో మెస్మరైజ్ చేశాడు. ఒకే ఒక్క ఓవర్​తో వాళ్లకు గట్టిగా ఇచ్చి పడేశాడు.

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టాలెంట్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ఈ వెటరన్ పేసర్ మరోమారు సూపర్ బౌలింగ్​తో మెస్మరైజ్ చేశాడు. ఒకే ఒక్క ఓవర్​తో వాళ్లకు గట్టిగా ఇచ్చి పడేశాడు.

టీమిండియా నుంచి ఎందరో పేస్ బౌలర్లు వచ్చి క్రికెట్​పై తమదైన ముద్ర వేశారు. బ్యాటింగ్ కర్మాగారంగా పిలిచే భారత్ నుంచి క్వాలిటీ స్పిన్నర్స్​తో పాటు మంచి పేసర్లు కూడా చాలా మందే వచ్చారు. అందులో ఒకడు భువనేశ్వర్ కుమార్. గత పదేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. స్వింగ్ ఆయుధంతో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ స్టార్ బౌలర్​గా ఎదిగాడు. ఇన్​స్వింగ్, ఔట్​స్వింగ్, స్లో బాల్స్​తో బ్యాట్స్​మెన్​కు కొరకరాని కొయ్యగా మారాడు. కొన్ని టెస్టులు ఆడినప్పటికీ లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్న భువీకి కొంత కాలంగా ఏదీ కలసి రావడం లేదు. గాయాల వల్ల రిథమ్​ను కోల్పోయిన అతడు మునుపటి స్థాయిలో బౌలింగ్ వేయడం లేదు. పేస్ తగ్గడంతో పాటు రిథమ్ కూడా మిస్సయింది. దీంతో టీమిండియాలో చోటు కోల్పోయిన భువీ రంజీ ట్రోఫీ-2024లో దుమ్మురేపుతున్నాడు. సంచలన బౌలింగ్​ ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టిగా ఇచ్చిపడేశాడు.

రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్​లో భాగంగా బెంగాల్​తో జరిగిన మ్యాచ్​లో ఉత్తర్​ ప్రదేశ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్​లో ఇప్పటిదాకా 13 ఓవర్లు వేసిన అతడు 25 పరుగులు ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్​లో 3 వికెట్లు తీయడం విశేషం. అతడి దెబ్బకు బెంగాల్ 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భువీ జోరు చూస్తుంటే ఈ మ్యాచ్​లో మరో మూడు వికెట్లు తీయడం పెద్ద కష్టం కాదనిపిస్తోంది. బెంగాల్ ఇన్నింగ్స్​ మొత్తాన్ని అతడే కుప్పకూల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మునుపటి స్థాయిలో బౌలింగ్ చేస్తున్న భువనేశ్వర్ ఈ ఇన్నింగ్స్​లో ఒకర్ని బౌల్డ్ చేయగా.. మరో ఇద్దర్ని వికెట్ల ముందుకు ఎల్బీడబ్ల్యూగా దొరకబుచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న భువీ.. రంజీ ట్రోఫీలో మున్ముందు మ్యాచుల్లోనూ ఇదే స్థాయిలో పెర్ఫార్మ్ చేయాలి. అప్పుడు తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.

భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసిన అభిమానులు అతడ్ని మెచ్చుకుంటున్నారు. భువీ పాత రోజులను గుర్తుచేస్తున్నాడని.. అతడు త్వరలో టీమిండియాలో కమ్​బ్యాక్ ఇస్తే చూడాలని ఉందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక, భువీ ఏడాది కాలం నుంచి భారత టీమ్​కు దూరంగా ఉంటున్నాడు. అతడు తన ఆఖరి టీ20 మ్యాచ్ 2022, నవంబర్ 22న న్యూజిలాండ్ మీద ఆడాడు. అదే ఏడాది జనవరి 21న సౌతాఫ్రికాపై లాస్ట్ వన్డే ఆడాడు. దీంతో భువీ కెరీర్ అయిపోయిందని.. వెటరన్ పేసర్ ఇక డొమెస్టిక్ క్రికెట్​తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్స్​లో ఆడుకోవాలని కొందరు విమర్శలు చేశారు. ఈ తరుణంలో అనూహ్యంగా రంజీ ట్రోఫీలో 5 వికెట్ల ప్రదర్శనతో మరోమారు అందరి దృష్టిని ఆకర్షించాడు భువీ. అతడు ఇలాగే రాణిస్తే జట్టులోకి తీసుకోవడం తప్పితే సెలక్టర్లకు మరో ఆప్షన్ ఉండదు. మరి.. భువీ సంచలన ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్ క్రికెట్​లో నయా సంచలనం.. ఛాన్స్ ఇస్తే పరువు నిలబెట్టేలా ఉన్నాడు!

Show comments