iDreamPost

NZ vs PAK: పాక్ క్రికెట్​లో నయా సంచలనం.. ఛాన్స్ ఇస్తే పరువు నిలబెట్టేలా ఉన్నాడు!

  • Published Jan 12, 2024 | 4:27 PMUpdated Jan 12, 2024 | 4:27 PM

పాకిస్థాన్​ క్రికెట్​లో నయా సంచలనం. దాయాది జట్టలోకి ఓ కొత్త కుర్రాడు మెరుపులా దూసుకొచ్చాడు. అతడికి ఛాన్స్ ఇస్తే పాక్ పరువు నిలబెట్టేలా ఉన్నాడు.

పాకిస్థాన్​ క్రికెట్​లో నయా సంచలనం. దాయాది జట్టలోకి ఓ కొత్త కుర్రాడు మెరుపులా దూసుకొచ్చాడు. అతడికి ఛాన్స్ ఇస్తే పాక్ పరువు నిలబెట్టేలా ఉన్నాడు.

  • Published Jan 12, 2024 | 4:27 PMUpdated Jan 12, 2024 | 4:27 PM
NZ vs PAK: పాక్ క్రికెట్​లో నయా సంచలనం.. ఛాన్స్ ఇస్తే పరువు నిలబెట్టేలా ఉన్నాడు!

పాకిస్థాన్.. ఈ పేరు తలచుకుంటే క్రికెట్​లో బౌలర్లే గుర్తుకొస్తారు. ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్.. ఇలా ఎందరో దిగ్గజ పేసర్లను జెంటిల్మన్ క్రికెట్​కు అందించింది దాయాది దేశం. అందుకే పాక్ బౌలింగ్ ఫ్యాక్టరీగా పేరు గాంచింది. అయితే ఆ దేశం నుంచి ఎందరో మంచి బ్యాట్స్​మెన్ కూడా వచ్చారనేది గుర్తుంచుకోవాలి. ఇంజమాముల్ హక్, మహ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్​లు తమ బ్యాటింగ్ ప్రతిభతో ఎంతో మంది హార్ట్స్ గెలుచుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పాక్ బ్యాటింగ్​లో తేలిపోతోంది. మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ లాంటి ఒకరిద్దరు తప్పితే ఇంటర్నేషనల్ లెవల్లో కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తున్న మరో బ్యాటర్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తానున్నాంటూ మెరుపులా దూసుకొచ్చాడో యంగ్ క్రికెటర్. అతడే సయీం అయూబ్. సంచలన ఇన్నింగ్స్​తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడతను.

న్యూజిలాండ్​తో 5 టీ20ల సిరీస్​లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్​లో సయీం అయూబ్ సత్తా చాటాడు. కేవలం 8 బంతుల్లోనే 27 పరుగులు చేసి కివీస్ బౌలర్లను వణికించాడీ ఓపెనర్. క్రీజులో ఉన్నది కాసేపే అయినా ప్రత్యర్థి జట్టును ఒక రేంజ్​లో భయపెట్టాడు. ఆడిన 8 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సులు కొట్టాడు. అతడి ఊపు చూస్తే ఈజీగా హాఫ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్ అయి క్రీజును వీడాడు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) ఆకట్టుకున్నాడు. సూపర్ ఫామ్​లో ఉన్న డారిల్ మిచెల్ (27 బంతుల్లో 61) చెలరేగిపోయాడు. దీంతో పాక్ ముందు భారీ టార్గెట్​ను ఉంచింది కివీస్. న్యూజిలాండ్ విసిరిన టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్​కు అదిరిపోయే ఆరంభం లభించింది.

కొత్త కుర్రాడు సయీం అయూబ్​తో పాటు మహ్మద్ రిజ్వాన్ (14 బంతుల్లో 25) కూడా అటాకింగ్​కు దిగడంతో 2 ఓవర్లలోనే 30 పరుగులు చేసింది పాక్. ఆ తర్వాత అయూబ్ ఔటైనా బాబర్ ఆజం (57) రాణించడంతో దాయాది జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది. కానీ వరుసగా వికెట్లు పడటం, మిడిలార్డర్​ ఫెయిలవడంతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్​కు జతగా కనీసం ఒక్క బ్యాటర్ క్రీజులో నిలబడ్డా మ్యాచ్​ గెలిచే అవకాశం ఉండేది. కానీ మిడిలార్డర్, లోయరార్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఓటమి తప్పలేదు. పాక్ ఓడినా ఓపెనర్ అయూబ్ ఆడిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. అతడు రనౌట్ కాకపోతే సిచ్యువేషన్ వేరేలా ఉండేదని అంటున్నారు. చెత్త ప్లేయర్లకు బదులు అయూబ్​ లాంటి యంగ్​స్టర్స్​కు ఛాన్స్ ఇస్తే పాక్ పరువు నిలబెడతాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కివీస్​పై పాక్ నయా ఓపెనర్ సయీం అయూబ్ ఆడిన తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన విధ్వంసక బ్యాటర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి