SNP
Rahul Tewatia, Pakistan: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడే ఓ భారత క్రికెటర్ తాజాగా పాకిస్తాన్‌పై ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు. మరి అతను ఆ పోస్ట్ ఎందుకు చేశాడో ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Rahul Tewatia, Pakistan: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడే ఓ భారత క్రికెటర్ తాజాగా పాకిస్తాన్‌పై ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు. మరి అతను ఆ పోస్ట్ ఎందుకు చేశాడో ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన రాహుల్ తెవాటియా పాకిస్థాన్‌పై వివాదాస్పద పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు.. పాలస్థీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాజాలోని రఫా అనే నగరంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఉద్దేశించి ఏఐ జనరేట్ చేసిన ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇది ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఉండే హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంది. ఆమె తన స్టోరీని డిలీట్ చేసింది.
అయితే తాజాగా రాహుల్ తెవాటియా మాత్రం పాకిస్థాన్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తాడు. ‘అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపై ఉంది’ అనే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు. రాహుల్ పెట్టిన ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా లెవనెత్తడంపై కొంతమంది తెవాటియాను ప్రశంసిస్తున్నారు. కానీ, చాలా మంది మాత్రం.. మణిపూర్‌లో జరుగుతున్న హింస, రైతులపై జరిగిన దాడులు కనిపించడం లేదా అంటూ మండిపడుతున్నారు.
అసలు ఏంటీ ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’?
రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయగా.. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తిన్ పౌరులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కలిచివేశాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ప్రముఖులు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషీయల్ టెక్నాలజీ జనరేట్ చేసిన ‘అందరి కళ్లు రఫాపైనే ఉన్నాయి’ అనే ఫోటో ట్రెండింగ్‌లో నిలిచింది.
Finally Indian celebrities are now taking stand for the Hindus of Pakistan.
Cricketer Rahul Tewatia has posted this post on his Instagram story.
All Eyes on Hindus In Pakistan. pic.twitter.com/Vj4VtI3Duv
— Dhruv Tripathi (@Dhruv_tr108) May 29, 2024