iDreamPost
android-app
ios-app

టీమిండియా ప్లేయర్ పై ద్రవిడ్ ప్రశంసలు.. అతడో గొప్ప ఆటగాడు అంటూ..!

  • Author Soma Sekhar Published - 05:44 PM, Sat - 11 November 23

టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్. ఆ ఆటగాడు ఒత్తిడిలో మరింత గొప్పగా రాణిస్తాడని కితాబిచ్చాడు ద్రవిడ్.

టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్. ఆ ఆటగాడు ఒత్తిడిలో మరింత గొప్పగా రాణిస్తాడని కితాబిచ్చాడు ద్రవిడ్.

  • Author Soma Sekhar Published - 05:44 PM, Sat - 11 November 23
టీమిండియా ప్లేయర్ పై ద్రవిడ్ ప్రశంసలు.. అతడో గొప్ప ఆటగాడు అంటూ..!

టీమిండియాలో ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ స్టర్స్ ఉన్నారు. వారిలో కొందరు ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అండ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక వారిలో కొందరు ఇప్పటికే టీమిండియాలోకి అడుగుపెట్టగా.. మరికొంతమంది యంగ్ స్టర్స్ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న ఓ టీమిండియా ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్. అతడో గొప్ప ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు టీమిండియా వాల్. మరి రాహుల్ మనసు గెలిచిన ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా దుమ్మురేపే ప్రదర్శన ఇస్తూ దూసుకెళ్తోంది. టైటిల్ ఫేవరెట్ గా వరల్డ్ కప్ బరిలోకి దూకిన భారత జట్టు అందుకు తగ్గట్లుగానే అద్భుత ఆటతీరుతో టైటిల్ ముద్దాడే దిశగా పయనిస్తోంది. జట్టులో దాదాపు అందరు ప్లేయర్లు సమయానికి తగ్గట్లుగా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్రపోషిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,శుబ్ మన్ గిల్, బుమ్రా, సిరాజ్, షమీలు నిలకడగా రాణిస్తున్నారు. వీరితో పాటుగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయర్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీలక మ్యాచ్ ల్లో తమ బ్యాట్ కు పనిచెబుతూ.. జట్టుకు విజయాలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఓ భారత మిడిలార్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.

అయ్యర్ గురించి మాట్లాడుతూ..”ఈ వరల్డ్ కప్ లో శ్రేయస్ అయ్యర్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. జట్టు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడి ఆటతీరు మరింత గొప్పగా ఉంటుంది. అదీకాక అయ్యర్ కు అద్భుతమైన టెంపర్ మెంట్ ఉంది. భవిష్యత్ లో అతడు టీమిండియాకు కీలకంగా మారుతాడు అందులో ఎలాంటి సందేహం లేదు” అంటూ యువ బ్యాటర్ పై ప్రశంసలు కురిపించాడు ద్రవిడ్. ఇక రోహిత్ గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఈ క్రికెట్ వాల్. రోహిత్ లో ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ లో గొప్ప నాయకుడు ఉన్నాడని, అతడు గేమ్ ప్రారంభంలో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసి.. వారిని ఒత్తిడిలోకి నెట్టేస్తాడని ద్రవిడ్ కితాబిచ్చాడు. హిట్ మ్యాన్ ఇలా జట్టుకు శుభారంభాలు అందివ్వడంతో.. టీమిండియా విజయాలకు పునాదులు పడుతున్నాయని ద్రవిడ్ పేర్కొన్నాడు.

కాగా అయ్యర్ ఈ వరల్డ్ కప్ లో శ్రీలంక మ్యాచ్ కంటే ముందు ఆడిన 6 మ్యాచ్ ల్లో కేవలం 134 రన్స్ మాత్రమే చేసి.. జట్టులో ఉంచాలా? తీసేయాలా? అన్న స్థితికి వచ్చాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం 53 బంతుల్లో 82 రన్స్ చేసి మెరుపు ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. ఈ ఒక్క తుపాన్ ఇన్నింగ్స్ తో తనపై వస్తున్న విమర్శలన్నింటికీ సమాధానం ఇచ్చాడు అయ్యర్. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ కు ముందు గాయం కారణంగా జట్టుకు కొన్ని నెలల పాటు దూరం కావాల్సి వచ్చింది. ఇక అతడిని ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నప్పుడు కూడా పూర్తి ఫిట్ నెస్ సాధించకుండా అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు అంటూ తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమైయ్యాయి.