iDreamPost
android-app
ios-app

ఎంత పని చేశావ్ నానమ్మ.. భారత్ కోసం రచిన్ నానమ్మ చేసిన పూజలు ఫలించాయి!

  • Published Nov 15, 2023 | 10:02 PM Updated Updated Nov 15, 2023 | 10:02 PM

ఇండియా - న్యూజీలాండ్ సెమీ ఫైనల్ కు ముందు రచిన్ రవీంద్ర నానమ్మ దిష్టి తీస్తూ పూజలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పూజలు మాత్రం మనవడి కోసం కాకుండా భారత్ గెలవాలని దేశభక్తి చాటుకుందంటూ మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇండియా - న్యూజీలాండ్ సెమీ ఫైనల్ కు ముందు రచిన్ రవీంద్ర నానమ్మ దిష్టి తీస్తూ పూజలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పూజలు మాత్రం మనవడి కోసం కాకుండా భారత్ గెలవాలని దేశభక్తి చాటుకుందంటూ మీమ్స్, జోక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎంత పని చేశావ్ నానమ్మ.. భారత్ కోసం రచిన్ నానమ్మ చేసిన పూజలు ఫలించాయి!

న్యూజిలాండ్ సంచలనం యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర వరల్డ్ కప్ లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రౌండ్ లో బ్యాటు ఝులిపిస్తూ పరుగుల వరద పారిస్తూ జట్టు గెలుపులో కీలకంగా మారారు. అయితే రచిన్ భారత్ మూలాలున్న క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. కాగా లీగ్ మ్యాచ్ ల సందర్భంగా బెంగుళూరు చేరుకున్న రచిన్ తన నానమ్మ, తాతయ్యల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రచిన్ నానమ్మ మనవడిని చక్కగా సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది. ఈ విషయం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే నానమ్మ తనకు దిష్టి తగల కుండా పూజలు చేస్తోందని భ్రమ పడ్డాడు కానీ భారత్ కోసమే నానమ్మ పూజలు చేసిందన్న విషయాన్ని పసిగట్ట లేకపోయాడంటూ సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ వైరల్ అయ్యాయి.

కానీ నేడు ఆ పెద్దావిడ చేసిన పూజలు దేశం కోసమే అన్నట్లుగా నిజమయ్యాయి. ప్రపంచ కప్ లో భాగంగా భారత్-న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రచిన్ రవీంద్ర కేవలం 13 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న రచిన్ మూడు ఫోర్లు బాది తక్కువ స్కోర్ కే పరిమితమయ్యాడు. కాగా భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వేసిన 7వ ఓవర్ నాలుగో బంతికి ఈ యువ బ్యాటర్ ఔటయ్యాడు. దీంతో రచిన్ నానమ్మ సెమీస్ లో ఇండియా మీద సరిగా ఆడకుండా మనవడిపై చేతబడి చేసిందంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. మా అవ్వకి నేనంటే ఎంత ప్రేమనో.. బాగా ఆడాలని దిష్టి తీస్తోందని భావించిన రచిన్ కు దేశ భక్తురాలైన నానమ్మ బిగ్ షాక్ ఇచ్చింది. దేశంపై తనకున్న ప్రేమను చాటుకుంది. ఈ క్రమంలోనే నా మనవడు భారత్ తో జరుగుతున్న సెమీస్ లో త్వరగా ఔటవ్వాలని పూజలు చేసినట్లు ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా అపజయమే లేకుండా అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. ప్రత్యర్థి జట్లను మట్టి కరిపిస్తూ సెమీస్ లోకి అడుగుపెట్టింది. నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో భారత్ సెమీఫైనల్లో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని కివీస్ ను బౌలింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్ సేన మెరుపు బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఛేదనలో తడబడుతోంది. భారత బౌలర్లు న్యూజీలాండ్ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన న్యూజీలాండ్ 176 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది.