iDreamPost
android-app
ios-app

Praveen Kumar: సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ తాగుబోతులు! ప్రవీణ్‌ కుమార్‌ కామెంట్స్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Published Jan 11, 2024 | 6:20 PM Updated Updated Jan 11, 2024 | 6:20 PM

ఇండియన్‌ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌కు ఎంత గొప్ప పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, అలాంటి వారిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇండియన్‌ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌కు ఎంత గొప్ప పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, అలాంటి వారిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 11, 2024 | 6:20 PMUpdated Jan 11, 2024 | 6:20 PM
Praveen Kumar: సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ తాగుబోతులు! ప్రవీణ్‌ కుమార్‌ కామెంట్స్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవల ఒక టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడిన ప్రవీణ్‌ కుమార్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. టీమిండియాకు త్రిమూర్తులుగా పేరొందిన సచిన్‌ టెండ్కూలర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లపై కూడా ప్రవీణ్‌ కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ప్రపంచ క్రికెట్‌కే దేవుడిగా ఎదిగాడు సచిన్‌ టెండూల్కర్‌. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో సచిన్‌ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉంటాడు. అలాగే ఇండియన్‌ క్రికెట్ తలరాతను మార్చిన గొప్ప కెప్టెన్‌గా సౌరవ్‌ గంగూలీ.. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ఇండియన్ కెప్టెన్స్‌లో దాదా ముందు వరుసలో ఉంటాడు. అలాగే ద్రవిడ్‌ భారత గొప్ప క్రికెటర్లులో ఒకడు. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్నాడు.

ఇలా ఇండియన్‌ క్రికెట్‌ను శాసించిన వీరి గురించి ప్రవీణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారంతా తాగుబోతులే అంటూ పేర్కొన్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎలాంటి వాతావరణం ఉండేది. సీనియర్లు ఎలాంటి సలహాలు ఇచ్చేవారు అని హోస్ట్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ప్రశ్నించగా.. దానికి బదులిస్తూ.. చాలా చెప్పేవాళ్లు అది చేయవద్దు ఇది చేయవద్దు.. మందు తాగొద్దు అని చెప్పేవాళ్లు. కానీ, వాళ్లు ఫుల్లుగా తాగే వాళ్లు అని పేర్కొన్నాడు. అంటే మీతో పాటు కలిసి ఆడిన సీనియర్లు అంటే.. సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ వీళ్లంతా తాగుబోతులేనా అని తిరిగి హోస్ట్‌ ప్రశ్నించగా.. దానికి ప్రవీణ్‌ కుమార్‌ కాదని సమాధానం చెప్పలేదు. ఆయన ఎక్స్‌ప్రెషన్‌లో అవును అన్నట్లే కనిపించింది.

ప్రస్తుతం ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే కాకుండా ప్రవీణ్‌ కుమార్‌ ఇంకా చాలా ఆసక్తికర విషయాలపై స్పందించాడు. రోహిత్‌ శర్మను కొంతమంది క్రికెట్‌ అభిమానులు అకారణంగా బూతులు తిట్టారని, కోహ్లీని గౌతమ్‌ గంభీర్‌ తిడితే అందులో తప్పులేదని, కోహ్లీ తనకు చిన్న తమ్ముడి లాంటి వాడని పేర్కొన్నాడు. అయితే.. సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ విషయంలో ప్రవీణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై మాత్రం క్రికెట్‌ అభిమానులు సీరియస్‌ అవుతున్నారు. సంచలనాల కోసం, అటెన్షన్‌ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. మరి టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్లపై ప్రవీణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by yr samar (@yrtweet2)