iDreamPost
android-app
ios-app

Pakistan: పాక్ ఆటగాళ్ల తిక్క కుదిరింది.. ఇక మీదట అవన్నీ నడవవు!

  • Published Jul 15, 2024 | 10:10 PMUpdated Jul 15, 2024 | 10:10 PM

పాకిస్థాన్ జట్టు పొట్టి ప్రపంచ కప్​లో దారుణమైన ఆటతీరుతో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ టీమ్ ప్లేయర్ల ఆటతీరుపై అందరూ సీరియస్ అవుతున్నారు.

పాకిస్థాన్ జట్టు పొట్టి ప్రపంచ కప్​లో దారుణమైన ఆటతీరుతో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ టీమ్ ప్లేయర్ల ఆటతీరుపై అందరూ సీరియస్ అవుతున్నారు.

  • Published Jul 15, 2024 | 10:10 PMUpdated Jul 15, 2024 | 10:10 PM
Pakistan: పాక్ ఆటగాళ్ల తిక్క కుదిరింది.. ఇక మీదట అవన్నీ నడవవు!

పాకిస్థాన్ జట్టు పొట్టి ప్రపంచ కప్​లో దారుణమైన ఆటతీరుతో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. టీమిండియాతో పాటు ఆతిథ్య అమెరికా చేతుల్లోనూ ఓటమిపాలైంది బాబర్ సేన. కెనడా లాంటి పసికూన మీద చచ్చీచెడి గెలిచింది. ఆ టీమ్ ఆటతీరు చూస్తుంటే అసలు ఇది పాకిస్థానేనా అని చాలా మంది సందేహించారు. పసలేని బౌలింగ్, కసి కనిపించని బ్యాటింగ్​తో ఉన్న ఆ జట్టు గ్రూప్ దశకే పరిమితమైంది. దీంతో ఆ టీమ్ ప్లేయర్ల ఆటతీరుపై అందరూ సీరియస్ అవుతున్నారు. ఇంత చెత్తాట ఏంటంటూ విమర్శిస్తున్నారు. కెప్టెన్ బాబర్​ ఆజంతో పాటు ఇతర సీనియర్ ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకవైపు ఫెయిల్యూర్​తో పాటు మరోవైపు పాక్ టీమ్​లోని ఇతర విషయాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

పాకిస్థాన్ జట్టులో ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదనే విషయం బయటపడింది. బాబర్​కు ఓ గ్రూప్, షాహిన్ అఫ్రిదీకి మరో గ్రూప్ ఉందని.. వీళ్ల మధ్య జట్టు చీలిపోయిందని వార్తలు వచ్చాయి. కోచ్​తో పాటు ఇతర సపోర్టింగ్ స్టాఫ్​ను అవమానించేలా షాహిన్ మిస్ బిహేవ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జట్టులోని ఏ ఒక్క ప్లేయర్ కూడా ఫిట్​నెస్ స్టాండర్డ్స్ పాటించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాలన్నీ పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దృష్టికి వచ్చాయట. క్రికెట్ మీద ఫోకస్ పెట్టకుండా ఆటగాళ్లు ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటూ టీమ్​కు నష్టం చేకూరుస్తుండటం, అవనసర వివాదాలు, చెత్తాట, ఫిట్​నెస్ లేకపోవడం వంటివన్నీ పాక్ క్రికెట్ పరువు తీస్తున్నాయని పీసీబీ భావిస్తోందట. అందుకే ప్రక్షాళన చేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ప్లేయర్లను గాడిన పెట్టాలని డిసైడ్ అయిందట.

పాక్ ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని పీసీబీ నిర్ణయించిందట. అలాగే వాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్​ల విషయంలోనూ సంస్కరణలు తీసుకురావాలని అనుకుంటోందని సమాచారం. ఈ మేరకు వన్డే-టీ20 కోచ్ గ్యారీ కిర్​స్టెన్, టెస్ట్ కోచ్ జేసన్ గిలెస్పీతో బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్లేయర్ల కాంట్రాక్ట్​ను మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించారని వినికిడి. క్రికెటర్ల ఫిట్​నెస్, బిహేవియర్, పెర్ఫార్మెన్స్ ప్రాతిపదికన ప్రతి ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్​ను రివైజ్ చేయాలని పీసీబీ భావిస్తోందట. ఆటగాళ్లను దారిలోకి తీసుకొచ్చేందుకు రెమ్యూనరేషన్ విషయంలోనూ కోత విధించాలని అనుకుంటోందట. అలాగే పూర్తిస్థాయి ఫిట్​నెస్ ఉన్న వాళ్లకే ఇక నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఫిక్స్ అయిందట. ఇది తెలిసిన నెటిజన్స్ పీసీబీ ఆటగాళ్ల తిక్క కుదిర్చిందని.. ఇక మీదట ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే నడవదని కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి