iDreamPost
android-app
ios-app

Harbhajan Singh: వాళ్లకు సారీ చెప్పిన హర్భజన్.. తాను కావాలని చేయలేదంటూ..!

  • Published Jul 15, 2024 | 10:01 PM Updated Updated Jul 15, 2024 | 10:01 PM

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురించి తెలిసిందే. ఎప్పుడూ ఫన్నీగా ఉంటూ అందర్నీ నవ్విస్తుంటాడు భజ్జీ. అలాంటోడు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురించి తెలిసిందే. ఎప్పుడూ ఫన్నీగా ఉంటూ అందర్నీ నవ్విస్తుంటాడు భజ్జీ. అలాంటోడు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

  • Published Jul 15, 2024 | 10:01 PMUpdated Jul 15, 2024 | 10:01 PM
Harbhajan Singh: వాళ్లకు సారీ చెప్పిన హర్భజన్.. తాను కావాలని చేయలేదంటూ..!

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురించి తెలిసిందే. ఎప్పుడూ ఫన్నీగా ఉంటూ అందర్నీ నవ్విస్తుంటాడు భజ్జీ. అలాంటోడు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. రీసెంట్​గా జరిగిన వరల్డ్ ఛాంపియన్​షిప్స్ ఆఫ్ లెజెండ్స్​లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ ఫైట్​లో పాకిస్థాన్​ను చిత్తు చేసి ఛాంపియన్​గా ఆవిర్భవించింది యువీ సేన. లెజెండ్ యువరాజ్ సింగ్ కెప్టెన్​గా ఉన్న ఈ టీమ్​లో సురేష్ రైనా, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్​తో పాటు హర్భజన్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్​లో భజ్జీ, యువీ, రైనాలు ‘తౌబా తౌబా’ అనే బాలీవుడ్ సాంగ్​పై కుంటుతూ, మూలుగుతూ నడుస్తూ వచ్చారు.

యువీ, భజ్జీ, రైనా చేసిన సెలబ్రేషన్ వీడియో కాస్తా వివాదాస్పదంగా మారింది. ఇది దివ్యాంగులను కించపరిచేలా ఉందంటూ పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి సీరియస్ అయ్యారు. ఇంత టాప్ క్రికెటర్స్ అయి ఉండి సున్నితత్వం లేకుండా ఇలా ప్రవర్తించడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇతరుల వైకల్యాన్ని కించపరిచేలా గెంతులు వేయడం సబబు కాదన్నారు. ఈ బాధ్యతారాహిత్యానికి వాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై భజ్జీ రియాక్ట్ అయ్యాడు. తాము కావాలని చేయలేదంటూ అతడు సారీ చెప్పాడు. ఎవర్నీ ఉద్దేశించి చేసిన వీడియో కాదన్నాడు.

గత 15 రోజులుగా వరల్డ్ ఛాంపియన్​షిప్స్​ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆడి తీవ్రంగా అలసిపోయామన్నాడు హర్భజన్. నాన్​స్టాప్ క్రికెట్​ వల్ల తమ శరీరాలు అలా తయారయ్యాయని ఫన్నీగా చెప్పే ఉద్దేశంతోనే వీడియో చేశామన్నాడు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అలా చేయలేదన్నాడు. ప్రతి వ్యక్తిని తాము గౌరవిస్తామని ట్విట్టర్​లో పెట్టిన పోస్ట్​లో స్పష్టం చేశాడు భజ్జీ. అయినా సరే తాము తప్పు చేశారని ఎవరైనా భావిస్తే వాళ్లు క్షమించాలని కోరాడు. ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపాలని విజ్ఞప్తి చేశాడు టర్బనేటర్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోస్ట్​లో రాసుకొచ్చాడు. మరి.. భారత దిగ్గజ క్రికెటర్ల తాజా వివాదంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.