Nidhan
వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో షాక్. ఆ దేశ క్రికెట్‌కు సంబంధించిన మరో కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశారు.
వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో షాక్. ఆ దేశ క్రికెట్‌కు సంబంధించిన మరో కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశారు.
Nidhan
గతేడాది ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ టీమ్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన దాయాది జట్టు తమ ఆటతీరుతో కూడా అందర్నీ నిరాశపర్చింది. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగి తుస్సుమంది. సెమీఫైనల్‌కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి అవమానకర రీతిలో బయటకు వచ్చేసింది పాక్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి టాప్ టీమ్స్‌తో పాటు ఆఫ్ఘానిస్థాన్ లాంటి చిన్న జట్టు చేతిలోనూ ఓడి తీవ్ర విమర్శల్ని మూటగట్టుకుంది. పాక్ ప్లేయర్ల ఆటతీరుపై సొంత దేశ అభిమానులే ట్రోలింగ్‌కు దిగారు. ఇదేం బ్యాటింగ్, ఇదేం ఫీల్డింగ్ అంటూ విరుచుకుపడ్డారు. దీని ఎఫెక్ట్ పాకిస్థాన్ క్రికెట్ మీద బలంగా పడింది. వరల్డ్ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఒక్కొక్కరుగా పాక్ క్రికెట్లో కీలక వ్యక్తులు రిజైన్ చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ జకా అష్రాఫ్ తన పదవి నుంచి తప్పుకున్నారు.
పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జకా అష్రఫ్ తెలిపారు. పాకిస్థాన్ క్రికెట్‌ను మరింత మెరుగుపర్చడం కోసం తాను పని చేశానన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్క్ చేయడం కుదరదన్నారు. ‘క్రికెట్ బెటర్మెంట్ కోసం నేను కృషి చేశా. కానీ ఇప్పుడు పని చేయడం కుదరదు. ఈ పరిస్థితుల్లో నేను వర్క్ చేయలేను. నా తర్వాత నెక్స్ట్ పీసీబీకి ఎవరు ఛైర్మన్‌గా ఉండాలనేది ప్రధాన మంత్రి నిర్ణయిస్తారు. ఆ పోస్టుకు ఎవర్ని నామినేట్ చేయాలనేది పూర్తిగా ఆయన డిసిషన్’ అని చెప్పుకొచ్చారు జకా అష్రఫ్. ఇక, ఆయన కంటే ముందు నజమ్ సేథీ ఆ పదవిలో ఉన్నారు. అయితే జులై 6, 2023 నుంచి ఛైర్మన్‌గా పీసీబీ బాధ్యతలు చేపట్టిన జకా అష్రఫ్.. ఏడాది తిరగకుండానే ఆ పోస్టుకు రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జకా అష్రఫ్ రాజీనామా పాకిస్థాన్ క్రికెట్లో మరో భారీ కుదుపు అనే చెప్పాలి. నిన్న (గురువారం)నే పాక్ కోచ్ పదవి నుంచి మికీ ఆర్థర్ తప్పుకున్నారు. ఆయనతో పాటు టీమ్ హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి తమ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పాక్ క్రికెట్‌తో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని వాళ్లు వెల్లడించారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఏకంగా ఛైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి తన పోస్టు నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. అసలు పాక్ క్రికెట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. వరుస ఓటములతో టీమ్ డీలాపడ్డ ఈ టైమ్‌లో ఈ రాజీనామాల పర్వం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండ్రోజుల వ్యవధిలో నలుగురు కీలక వ్యక్తులు తప్పుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. పాక్ క్రికెట్‌ను త్వరగా చక్కదిద్దాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. పాక్ క్రికెట్లో ముసలం నెలకొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yesterday – Pakistan Head Coach Mickey Arthur resigned.
Today – PCB Chairman Zaka Ashraf has resigned.
– The never ending drama in Pakistan board continues…!!! pic.twitter.com/vr3RTDb7tU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 19, 2024