SNP
Pakistan, PCB, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ ప్లాన్ వేసింది. టోర్నీ ఆరంభానికి ముందు ఆ జట్టు ఆటగాళ్లకు కళ్లు చెదిరే బంపరాఫర్‌ను ప్రకటించింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Pakistan, PCB, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ ప్లాన్ వేసింది. టోర్నీ ఆరంభానికి ముందు ఆ జట్టు ఆటగాళ్లకు కళ్లు చెదిరే బంపరాఫర్‌ను ప్రకటించింది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంటే.. పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రం అప్పుడే టీ20 వరల్డ్ కప్‌పై ఫోకస్ పెట్టారు. భారత సెలెక్టర్లు ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించారు. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీమ్‌ను ప్రకటించకుండానే.. తమ ఆటగాళ్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. నేరుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ తమ ఆటగాళ్లతో భేటీ అయి.. మొహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షాలకు ప్రత్యేక జెర్సీలను బహూకరించి.. ఈ ఆఫర్‌ను ప్రకటించాడు. జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024ను కనుక పాకిస్థాన్ గెలిస్తే.. ఒక్కో ఆటగాడికి 2.77 కోట్ల పాకిస్థాన్ కరెన్సీ ఇస్తామంటూ.. పీసీబీ ఛైర్మన్ ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్‌తో పాకిస్థాన్ క్రికెటర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న జీతం కాకుండా.. అదనం భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేయడంతో సంతోషంలో మునిగిపోయారు.
అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్ టీమ్ పరిస్థితి అంత బాగాలేదు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. బాబర్ అజమ్ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత షాహీన్ అఫ్రిదీ కెప్టెన్సీలో పాకిస్థాన్ టీమ్ చెత్త ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంది. దీంతో.. తిరిగి మళ్లీ బాబర్ అజమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పీసీబీ. ఆ తర్వాత.. పాకిస్థాన్ టీమ్‌కు వెరైటీగా ఆర్మీ ట్రైనింగ్ ఇప్పించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. బ్యాట్లు పట్టాల్సిన క్రికెటర్లు గన్నులు పట్టి, కొండలు ఎక్కి తెగ ప్రాక్టీస్ చేశారు.
తాజాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఐదు టీ20ల సిరీస్ ఆడిన పాకిస్థాన్ పెద్దగా ఆకట్టుకోలేదు. తమ దేశంలో ఆడుతూ కనీసం సిరీస్ నెగ్గలేకపోయింది. పాకిస్థాన్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌ను 2-2తో సమం చేసి.. న్యూజిలాండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా న్యూజిలాండ్ పూర్తి స్థాయి టీమ్‌తో కూడా పాక్ పర్యటనకు రాలేదు. న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో.. న్యూజిలాండ్ టీమ్ బీని పాక్ పర్యటనకు వచ్చింది. ఆ టీమ్‌ను కూడా పాక్ ఓడించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ టీమ్ టీ20 వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకోవడం హాస్యాస్పదం అవుతుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. 2.77 కోట్లు కాదు కదా 200 కోట్లు ఇచ్చినా.. పాక్ టీమ్ వరల్డ్ కప్ కొట్టలేదని జోకులు పేలుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
PCB Chairman promises 2.77 Cr PKR per player if they win T20 World Cup 2024.pic.twitter.com/KJhzYTG6DC
— CricketGully (@thecricketgully) May 5, 2024