Vinay Kola
CPL 2024: కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. తాజాగా 124 మీటర్ల సిక్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నమోదయ్యింది.
CPL 2024: కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. తాజాగా 124 మీటర్ల సిక్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నమోదయ్యింది.
Vinay Kola
క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కంటే టీ 20 మ్యాచ్ లకు ఇంటర్నేషనల్ లెవెల్ లో సూపర్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే టీ 20 లలో బాల్స్ బీభత్సంగా గాల్లోకి లేస్తాయి. బ్యాటర్లు సిక్సులు, ఫోర్లతో బౌండరీల మీద బౌండరీలు బాదేస్తూ ఉంటారు. బ్యాటర్లు బ్యాట్లతో మోత మోగిస్తూ ఉంటే అభిమానులు అరుపులు, చప్పట్లతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో ఆటగాళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు. అభిమానులకు ఒక రేంజిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇలాంటి టోర్నమెంట్లలో సిక్సర్లు హైలెట్ గా నిలుస్తాయి. భారీ సిక్సుల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తాజాగా అలాంటి ఓ భారీ సిక్స్ హైలెట్ అవుతుంది.
ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఆటగాళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు. ఒక వంద మీటర్ల సిక్స్ కొడితేనే అభిమానులు ఆశ్చర్యపోతారు. అటువంటిది ఏకంగా 124 మీటర్ల సిక్స్ అంటే ఇంకేమైన ఉందా అరుపులు ఈలలతో స్టేడియంని మారుమోగించరు. తాజాగా 124 మీటర్ల సిక్స్ ఒకటి కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో నమోదయ్యింది. గయానా అమెజాన్ వారియర్స్ టీంతో జరిగిన మ్యాచ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ టీం 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చెయ్యగా ట్రిన్ బాగో నైట్ రైడర్స్ టీం 19.2 ఓవర్లలో 5 వికెట్లకు గాను 149 పరుగులు చేసి గెలిచింది.
ఇక ఈ మ్యాచ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ ఓపెనర్ పారిస్ ఏకంగా 124 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. అతను బాదిన ఈ సిక్సర్ నేరుగా స్టేడియం పై కప్పు పైన పడింది. దాంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో భారీ సిక్సర్ కొట్టిన రికార్డు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పేరు మీద ఉంది. షాహిద్ ఏకంగా 153 మీటర్ల సిక్సర్ బాది ఈ రికార్డు క్రియేట్ చేశాడు. మరి ఈ రికార్డుని ఏ ప్లేయర్ బద్దలు కొడతాడో చూడాలి. ఇక తాజాగా పారిస్ కొట్టిన ఈ 124 మీటర్ల భారీ సిక్సర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో మీకు నచ్చిన సిక్సర్ ఏదో కామెంట్ చెయ్యండి.
124 metres!!! You have to be joking Shaqkere Parris🤯#CPL #TKRvGAW #BiggestPartyInSport #CricketPlayedLouder #CaribbeanAirlines @iflycaribbean pic.twitter.com/ev72KN13H7
— CPL T20 (@CPL) September 19, 2024