Paris Sports Court Supports Vinesh Phogat Petition For Silver Medal: వినేశ్ ఫోగట్ కు ఊరట.. సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేయచ్చన్న పారిస్ స్పోర్ట్స్ కోర్టు!

వినేశ్ ఫోగట్ కు ఊరట.. సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేయచ్చన్న పారిస్ స్పోర్ట్స్ కోర్టు!

Paris Sports Court Supports Vinesh Phogat Petition For Silver Medal: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు పారిస్ స్పోర్ట్స్ కోర్టు శుభవార్త తెలియజేసింది. తాను సిల్వర్ మెడల్ కోసం పోరాటం చేయచ్చు అని పారిస్ స్పోర్ట్స్ కోర్టు ప్రకటించింది. ఆమె పిటిషన్ కు మద్దతు తెలిపింది.

Paris Sports Court Supports Vinesh Phogat Petition For Silver Medal: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు పారిస్ స్పోర్ట్స్ కోర్టు శుభవార్త తెలియజేసింది. తాను సిల్వర్ మెడల్ కోసం పోరాటం చేయచ్చు అని పారిస్ స్పోర్ట్స్ కోర్టు ప్రకటించింది. ఆమె పిటిషన్ కు మద్దతు తెలిపింది.

వినేశ్ ఫోగట్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన రెజ్లర్ గురించే చర్చ జరుగుతోంది. ఒలింపిక్స్ లో వీరోచితంగా పోరాడి.. ఫైనల్ కు చేరి కూడా.. వంద గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమెకు కనీసం సిల్వర్ మెడల్ కూడా దక్కదు అని చెప్పేశారు. ఎందుకంటే ఫైనల్ లో డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టి ఎలాంటి మెడలు అనేది రాదు అని చెప్పారు. ఈ విషయంలో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. భారతదేశ ప్రముఖులు, సెలబ్రిటీలు, అథ్లెట్స్ మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్స్ కూడా వినేశ్ ఫోగట్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై వినేశ్ ఫోగట్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది.

వినేశ్ ఫోగట్ కు పారిస్ స్పోర్ట్స్ కోర్టులో భారీ ఊరట లభించింది. తనకు కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలి అంటూ తాను పారిస్ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రియించింది. అలాగే తాను అసలు వెయిట్ ఎలా పెరిగింది? తాను ఆ బరువును తగ్గించుకోవడానికి ఎలాంటి కఠినతర విధానాలు అవలభించింది? ఆ తర్వాత తాను ఎలా ఆస్పత్రి పాలైంది అనే విషయాలను కోర్టుకు సవివరంగా తెలియజేసింది. వినేశ్ ఫోగట్ పిటిషన్ చూసిన కోర్టు తనకు మద్దతు తెలిపింది. వినేశ్ ఫోగట్ సిల్వర్ మెడలు కోసం అర్హురాలే అనే విషయాన్ని వెల్లడించింది. తాను సిల్వర్ మెడల్ కోసం పోరాడొచ్చని తెలిపింది. అయితే ఈ విషయంలో పారిస్ కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వినేశ్ కు సంబంధించి సమగ్ర విచారణ జరపమని చెబుతుందా? లేదా సిల్వర్ మెడల్ ఇవ్వాలని ఒలింపిక్ కమిటీకి సూచిస్తుందా? అనే విషయాలపై మాత్రం సందిగ్ధత నెలకొంది.

Show comments