Rohit Sharma-PR Sreejesh: అచ్చం రోహిత్ శర్మ లాగే వీడ్కోలు పలికిన శ్రీజేష్! ఫొటోలు వైరల్..

ఒలింపిక్స్ కాంస్య పోరులో స్పెయిన్ పై విజయం సాధించిన తర్వాత అచ్చం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసినట్లుగానే చేసి.. వీడ్కోలు పలికాడు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒలింపిక్స్ కాంస్య పోరులో స్పెయిన్ పై విజయం సాధించిన తర్వాత అచ్చం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసినట్లుగానే చేసి.. వీడ్కోలు పలికాడు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ది ఇండియన్ వాల్ ఆఫ్ హాకీ పీఆర్ శ్రీజేష్ విజయంతో తన కెరీర్ ను ముగించాడు. పారిస్ ఒలింపిక్స్ లో స్పెయిన్ తో జరిగిన కాంస్య పోరులో అద్భుత విజయంతో ఆటకు గుడ్ బై చెప్పాడు. ఇక ఈ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే తన రిటైర్మెంట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ కు గోల్డ్ మెడల్ అందించి సగర్వంగా వీడ్కోలు పలుకుదామని అనుకున్న శ్రీజేష్.. కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే స్పెయిన్ పై విజయం సాధించిన తర్వాత అచ్చం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసినట్లుగానే చేసి.. వీడ్కోలు పలికాడు ఈ స్టార్ గోల్ కీపర్. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్య పోరులో స్పెయిన్ ను 2-1తో ఓడించింది. ఇక ఈ విజయం తర్వాత భారత స్టార్ హాకీ కీపర్ పీఆర్ శ్రీజేష్ తన విజయాన్ని అచ్చం రోహిత్ శర్మలా సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ గెలవగానే మైదానంలోనే బొక్కబోర్లా పడుకుని సాష్టంగా నమస్కారం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా.. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఇలాగే గ్రౌండ్ సాష్టంగా నమస్కారం చేసి, తన ఆటకు వీడ్కోలు ప్రకటించాడు. ఇప్పుడు ఈ స్టార్ గోల్ కీపర్ కూడా ఇలాగే చేసి, తన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ రెండు ఫొటోలను అభిమానులు ఎడిట్ చేసి, అచ్చం రోహిత్ లానే శ్రీజేష్ కూడా తన ఆటకు గుడ్ బై చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడిన శ్రీజేష్ కు సహచర ప్లేయర్లు ఘనమైన వీడ్కోలు ఇచ్చారు. అతడిని భుజాలపై ఎక్కించుకుని గోల్ పోస్ట్ పై కూర్చోబెట్టారు, హాకీ స్టిక్స్ తో జేజేలు పలికారు. మరి అచ్చం రోహిత్ లాగే శ్రీజేష్ చేయడం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments