Dharani
Olympics 2024-Vinesh Phogat Disqualified: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు మరో పతకం ఖాయమనుకుంటున్న వేళ ఊహించని షాక్ తగిలింది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు విధించారు. ఆ వివరాలు..
Olympics 2024-Vinesh Phogat Disqualified: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు మరో పతకం ఖాయమనుకుంటున్న వేళ ఊహించని షాక్ తగిలింది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు విధించారు. ఆ వివరాలు..
Dharani
పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం పక్కా అనుకుంటున్న సమయంలో.. ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మహిళల రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ పక్కా అని దేశ ప్రజలంతా నమ్మకంగా ఉన్న వేళ షాకింగ్ నిర్ణయం వెలువడింది. భాతర మహిళ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆమెను ఒలింపిక్స్ ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. భారత్‌కు మరో పతకం పక్కా అనుకుంటున్న వేళ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం.. క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అసలేం జరిగింది.. ఎందుకు వినేశ్ ఫొగాట్ ఫైనల్స్‌కు దూరం అయ్యింది అంటే..
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరుకున్న వినేశ్ ఫొగాట్.. అనర్హత వేటు వేశారు. దాంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే వెను దిరగాల్సిన పరిస్థితి వచ్చింది. డిస్‌క్వాలిఫై చేయడానికి కారణం ఆమె ఉండాల్సిన 50 కేజీల బరువు కన్నా కొన్ని గ్రాముల వెయిట్ ఎక్కువగా ఉంది. దాంతో ఆమెపై అనర్హత వేటు వేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసిషన్(ఐఓఏ) వెల్లడించింది. ఈమేరకు ఐఓఏ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేశారని వెల్లడించడానికి మేం చింతిస్తున్నాం. టీమ్ రాంత్రంతా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఉదయం ఆమె 50 కేజీల కన్నా కొన్ని గ్రాముల బరువు అధికంగా తూగింది. దాంతో అనర్హత విధించారు’’అని చెప్పుకొచ్చింది.
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీ ఫైనల్‌లో వినేశ్ 5-0తో క్యూబాకు చెందిన ఉస్నేలిస్ గుజ్‌మన్ లోపెజ్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో వినేష్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ నుంచి రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. ఈ గెలుపుతో తనకు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది.. కానీ, ఫైనల్ లో విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ పతకం పక్కా అనుకుంటున్న వేళ.. ఇలాంటి నిర్ణయం వెలువడటం దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఈ నిర్ణయం క్రీడాభిమానులనే కాక భారతీయులందరిని తీవ్ర నిరాశకు గురి చేసింది.