Olympics 2024: ఒలింపిక్స్‌ విజేతలకు భారీగా నగదు.. ఎంత ఇస్తారంటే

Paris Olympics 2024-Reward, India: పారిస్‌ ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మరి వారికి ప్రైజ్‌ మనీ ఎంత ఇస్తారు అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

Paris Olympics 2024-Reward, India: పారిస్‌ ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మరి వారికి ప్రైజ్‌ మనీ ఎంత ఇస్తారు అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

క్రీడా రంగంలో అ‍త్యంత ప్రతిష్టాత్మతకంగా భావించే ఒలింపిక్స్‌ 2024 ప్రారంభం అయ్యింది. నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ వేడుకులకు ఈ సారి పారిస్‌ వేదికయ్యింది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. ఇక ఈ ఏడాది మన దేశం నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు.. వేర్వేరు అంశాల్లో తమ సత్తా చాటడానికి పారిస్‌ వెళ్లారు. ఇప్పటికే మను బాకర్‌ రెండు పతకాలను ఇండియాకు అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. వీరిద్దరి సాధించిన విజయాల పట్ల దేశం యావత్తు పొంగిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి.. దేశం కీర్తిని ప్రపంచవేదికల మీద వేనోళ్ల పొగిడేలా చేసిన క్రీడాకారులకు, వారు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ.. ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. సుమారు 33 దేశాలు.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందిస్తాయి. వీటిల్లో సుమారు 15 దేశాలు గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి లక్ష డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. సుమారు 82 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చి ప్రోత్సాహిస్తాయి.

ఇక ఇండియా విషయానికి వస్తే.. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ).. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించిన భారతీయ ఆటగాళ్లకు రూ. 75 లక్షలు, రజత పతక​ సాధించిన వారికి రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 30 లక్షలు అందజేస్తామని భారతదేశంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2019లో ప్రకటించింది.

అయితే ఈ ఒలింపిక్స్‌ నాటికి ఐఓఏ ఈ ప్రైజ్‌మనీని పెంచింది. దీని ప్రకారం ఇప్పుడు గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఆటగాళ్లలకు రూ.కోటి, సిల్వర్‌ మెడల్‌ సాధించిన వారికి 75 లక్షలు, మిగతా వారికి 50 లక్షల రివార్డు అందించనుంది. ఇవి కాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రత్యేకంగా నగదు బహుమతి అందజేస్తాయి.

ఏ దేశం ఎక్కువ నగదు ఇస్తుందంటే..

ఒలింపిక్ పతక విజేతలకు అత్యధికంగా నగదు రివార్డు ఇచ్చే దేశం హాంకాంగ్‌. చైనా నుంచి స్వతంత్రంగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న హాంకాంగ్.. గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి 7,68,000 డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ. 6.3 కోట్లు చెల్లిస్తుంది. అలానే రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు 3,80,000 అంటే దాదాపు రూ. 3.1 కోట్లు ఇస్తుంది. హాంకాంగ్‌ తర్వాత క్రీడాకారులకు పెద్ద మొత్తంలో నగదు రివార్డు ఇచ్చే మరో దేశం ఇజ్రాయేల్‌. ఈ దేశం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు 2,75,000 డాలర్లు అంటే దాదాపు రూ. 2.2 కోట్లు ఇస్తుంది. ఆ తర్వాత స్థానంలో సెర్బియా నిలిచింది. ఈ దేశం ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి 218,000 డాలర్లు అంటే దాదాపు రూ. 1.8 కోట్లు ఇస్తుంది.

Show comments