Hockey India: ఒలింపిక్స్ లో కాంస్యం.. హాకీ ప్లేయర్లకు రూ. 15 లక్షల నజరానా!

పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ టీమ్ కు భారీ నజరానా ప్రకటించింది హాకీ ఇండియా. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఓ ప్రకటనను విడుదల చేశాడు.

పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ టీమ్ కు భారీ నజరానా ప్రకటించింది హాకీ ఇండియా. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఓ ప్రకటనను విడుదల చేశాడు.

పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా స్పెయిన్ తో జరిగిన కాంస్య పోరులో భారత హాకీ జట్టు 2-1తో అద్భుత విజయం సాధించింది. దాంతో వరుసగా రెండు ఒలింపిక్స్ ల్లోనూ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ లో అద్భుత ప్రదర్శనతో హాకీ ప్లేయర్లు ఆకట్టుకున్నారు. మన ఆటగాళ్ల జోరు చూస్తే, గోల్డ్ మెడల్ ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ జర్మనీ చేతిలో అనూహ్య పరాభవంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బ్రాంజ్ మెడల్ సాధించిన ఇండియన్ హాకీ ప్లేయర్లకు నజరానా ప్రకటించింది హాకీ సంఘం.

పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు బ్రాంజ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. దాంతో వరుసగా రెండు ఒలింపిక్స్ ల్లోనూ కాంస్యం సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. కాంస్య పతకం సాధించిన హాకీ ప్లేయర్లకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది హాకీ ఇండియా. అలాగే సహాయక సిబ్బందికి రూ. 7.5 లక్షల చొప్పున అందించనుంది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు దిలీప్ టిర్కి ప్రకటన విడుదల చేశాడు. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి మాట్లాడుతూ..

“వరుసగా రెండు ఒలింపిక్స్ ల్లోనూ భారత్ పతకాలు గెలవడం గొప్ప విషయం. ఇది ప్రపంచ వేదికపై ఇండియన్ హాకీ పునర్జీవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆటగాళ్ల కఠిన శ్రమ, పట్టుదల, నిబద్ధతకు ఈ పతకం నిదర్శనం. ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ కష్టం కృషి ఫలితంగా ఈ పతకం దక్కింది. అయితే ఈ క్యాష్ ప్రైజ్ వారికి విజయానికి సరితూగదని తెలుసు. కానీ ప్రోత్సాహకం ఇవ్వడం అత్యవసరం. ఇక ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన పీఆర్ శ్రీజేష్ కు నా శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చాడు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి. మరి హాకీ ఇండియా ప్లేయర్లకు రూ. 15 లక్షలు నజరానా ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments