Paris Olympics 2024: జావెలిన్‌ త్రోలో పాక్‌కు గోల్డ్‌ మెడల్‌.. అర్షద్‌ నదీమ్‌కు డోప్‌ టెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌

Olympics 2024-Dope Test, Arshad Nadeem: పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడంతో.. విమర్శలు వస్తున్నాయి. డోప్‌ టెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

Olympics 2024-Dope Test, Arshad Nadeem: పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడంతో.. విమర్శలు వస్తున్నాయి. డోప్‌ టెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ, ఫైనల్లో తడబడ్డ అతడు 89.45 మీటర్లు బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. ఇక గత ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో పాకిస్తాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో నీరజ్ 89.45 మీటర్లు బల్లెం విసరగా.. అర్షద్ నదీమ్‌ 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఇద్దరు కూడా ఫౌల్ అయ్యారు. రెండో ప్రయత్నంలో దీన్ని సాధించారు. అయితే అర్షద్‌ నదీమ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించడంతో.. సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అతడికి డోప్‌ టెస్ట్‌ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో గురువారంఅర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరి రికార్డులను బద్దలు కొట్టి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రెండో రౌండ్‌లో 89.45 మీటర్లు విసిరాడు. నీరజ్‌ చోప్రా గతంలో టోక్యోలో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి నదీమ్‌ ఆ రికార్డు బద్దలు చేశాడు. నదీమ్‌ ఏకంగా 91.79 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. ఒలింపిక్స్‌లో ఇదే అత్యధికం. గతంలో అనగా 2008 బీజింగ్ గేమ్స్‌లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సెన్ నెలకొల్పిన 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డును నదీమ్‌ అధిగమించాడు.

నదీమ్ సాధించిన విజయంపై భారతీయ క్రీడాభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అతడికి డోప్‌ టెస్ట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అతడు తన సామర్థ్యాన్ని పెంచే డ్రగ్‌ను వినియోగించాడని.. అసలు 92 మీటర్ల దూరం బల్లెం విసరడం ఎవరికీ సాధ్యం కాదని.. ఒలింపిక్స్‌ కమిటీ దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు.

Show comments