iDreamPost
android-app
ios-app

David Warner: పాకిస్తాన్‌పై వార్నర్‌ దండయాత్ర! స్కోర్స్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

  • Published Dec 14, 2023 | 3:49 PM Updated Updated Dec 14, 2023 | 3:49 PM

ప్రతి ప్లేయర్ అన్ని టీమ్స్ మీదా బాగా ఆడాలనే అనుకుంటాడు. కానీ ఏదో ఒక జట్టుపై మాత్రం అతడి పర్సనల్ రికార్డ్స్ చాలా బాగుంటాయి. అదేదో దండయాత్ర చేసినట్లు ఆ ఒక్క టీమ్​తో మ్యాచ్ అంటేనే చెలరేగిపోతుంటారు. ఆసీస్ స్టార్ వార్నర్ కూడా పాక్ మీద ఇలాగే చెలరేగి ఆడుతుంటాడు.

ప్రతి ప్లేయర్ అన్ని టీమ్స్ మీదా బాగా ఆడాలనే అనుకుంటాడు. కానీ ఏదో ఒక జట్టుపై మాత్రం అతడి పర్సనల్ రికార్డ్స్ చాలా బాగుంటాయి. అదేదో దండయాత్ర చేసినట్లు ఆ ఒక్క టీమ్​తో మ్యాచ్ అంటేనే చెలరేగిపోతుంటారు. ఆసీస్ స్టార్ వార్నర్ కూడా పాక్ మీద ఇలాగే చెలరేగి ఆడుతుంటాడు.

  • Published Dec 14, 2023 | 3:49 PMUpdated Dec 14, 2023 | 3:49 PM
David Warner: పాకిస్తాన్‌పై వార్నర్‌ దండయాత్ర! స్కోర్స్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

వన్డే వరల్డ్ కప్​-2023లో పాకిస్థాన్ జట్టు దారుణమైన ప్రదర్శనతో సెమీస్​కు చేరకుండానే వెనుదిరిగింది. దీంతో ఆ దేశ క్రికెట్​లో భారీ మార్పులే జరిగాయి. కోచింగ్ సిబ్బంది, కెప్టెన్ దగ్గర నుంచి టీమ్ డైరెక్టర్, చీఫ్ సెలక్టర్ వరకు చాలా మందిని మార్చింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ప్రపంచ కప్ ఓటమి బాధలో నుంచి బయటపడేందుకు ఆస్ట్రేలియా టూర్​ రూపంలో దాయాది జట్టుకు మంచి అవకాశం దొరికింది. కఠినమైన కంగారూ సిరీస్​లో రాణించి అభిమానుల మద్దతును, హృదయాలను గెలుచుకోవాలని భావించింది పాక్ టీమ్. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదటి టెస్టులోనే ఆ జట్టును ముప్పుతిప్పలు పెడుతోంది ఆసీస్.

మూడు టెస్టుల సిరీస్​లో భాగంగా ఫస్ట్ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టుకు సీనియర్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (211 బంతుల్లో 164), ఉస్మాన్ ఖవాజా (98 బంతుల్లో 41) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీళ్లిద్దరూ కలసి తొలి వికెట్​కు 126 రన్స్ జోడించారు. ఆ తర్వాత ఖవాజా, మార్నస్ లబుషేన్ (16) తక్కువ గ్యాప్​లో ఔటయ్యారు. కానీ స్టీవ్ స్మిత్ (31), ట్రావిస్ హెడ్ (40)తో కలసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు డేవిడ్ భాయ్. పాక్ బౌలర్లు అందర్నీ ఓ ఆటాడుకున్నాడు వార్నర్. ఏస్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీతో పాటు ఇతర బౌలర్లను కూడా చీల్చి చెండాడాడు. వార్నర్ ఆడుతుంటే అది టెస్టా? లేదా టీ20నా? అనే అనుమానం అందరికీ కలిగింది.

న్యాచులర్ స్టైల్​లో బ్యాట్ ఝళిపించిన వార్నర్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ఇన్నింగ్స్​లో 16 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే డేవిబ్ భాయ్ విధ్వంసం ఏ రేంజ్​లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. బౌండరీలు, సిక్సుల ద్వారానే దాదాపు 90 పరుగుల వరకు రాబట్టుకున్నాడతను. వార్నర్ మెరుపు బ్యాటింగ్​కు తట్టుకోలేక ఎక్కడ బాల్ వేయాలో తెలియక పాక్ బౌలర్లు గుడ్లు తేలేశారు. అయితే ఎట్టకేలకు యంగ్ బౌలర్ ఆమెర్ జమాల్ బౌలింగ్​లో ఇమాముల్ హక్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్​కు చేరుకున్నాడు ఆసీస్ బ్యాటర్.

ఔటయ్యే లోపు చేయాల్సిన విధ్వంసాన్ని చేసేశాడు డేవిడ్ భాయ్. తనకు ఎంతో ఇష్టమైన పాక్​పై అతడికి గత 6 ఇన్నింగ్స్​ల్లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. గత ఆరు ఇన్నింగ్స్​ల్లో పాకిస్థాన్ మీద వార్నర్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 144, 113, 55, 154, 335 నాటౌట్, 164. దీన్ని బట్టే ఆ టీమ్ మీద అతడి దండయాత్ర ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితే అయిపోలేదు.. ఈ సిరీస్​లో మరో నాలుగైదు సార్లు అతడు బ్యాటింగ్​కు వస్తాడు. కాబట్టి మరిన్ని సెంచరీలు బాదే అవకాశం కనిపిస్తోంది. మరి.. పాక్​ మీద వార్నర్ దండయాత్రపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Team India: భారత టీమ్​లో వైస్ కెప్టెన్​కు విలువ లేదు.. వాళ్లదే పెత్తనం: సీనియర్ క్రికెటర్