iDreamPost

World Cup: పాక్ పరువు తీసిన ఆఫ్ఘాన్.. రిజ్వాన్ రియాక్షన్​ వైరల్!

  • Author singhj Published - 09:15 PM, Mon - 23 October 23

వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్​లో గెలవాల్సిన పరిస్థితి. ఈ టైమ్​లో ఆ టీమ్ పరువు తీసింది పసికూన ఆఫ్ఘానిస్థాన్.

వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్​లో గెలవాల్సిన పరిస్థితి. ఈ టైమ్​లో ఆ టీమ్ పరువు తీసింది పసికూన ఆఫ్ఘానిస్థాన్.

  • Author singhj Published - 09:15 PM, Mon - 23 October 23
World Cup: పాక్ పరువు తీసిన ఆఫ్ఘాన్.. రిజ్వాన్ రియాక్షన్​ వైరల్!

వరల్డ్ కప్-2023లో భాగంగా పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ టీమ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​ బాబర్ సేనకు చాలా కీలకంగా మారింది. సెమీఫైనల్ ఛాన్సులు దెబ్బతినకుండా ఉండాలంటే ఆఫ్ఘాన్​పై పాక్ తప్పక గెలవాలి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు పాక్ కెప్టెన్ బాబర్. దాయాది టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 రన్స్ చేసింది. బాబర్ ఆజం (74), అబ్దుల్లా షఫీక్ (58) రాణించారు. చివర్లో షాదాబ్ ఖాన్ (40), ఇఫ్తికార్ అహ్మద్ (40) మెరుపులు మెరిపించారు. ఇఫ్తికార్ అయితే 4 సిక్సులు బాదాడు. ఆఫ్ఘానిస్థాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. నవీనుల్ హక్​కు రెండు వికెట్లు దక్కాయి.

ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​ను ఆఫ్ఘానిస్థాన్​ వణికిస్తోంది. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ ఆ టీమ్​ను భయపెడుతోంది. నూర్ అహ్మద్ వరుస ఓవర్లలో షఫీక్, మహ్మద్ రిజ్వాన్​ను వెనక్కి పంపాడు. రిజ్వాన్ లాంటి ఎక్స్​పీరియెన్స్ ఉన్న బ్యాటర్ అహ్మద్​కు చిక్కడంతో పాక్ భారీ స్కోరు ఆశలకు గండి పడింది. అయితే చివర్లో ఇఫ్తికార్, షాదాబ్ అదరగొట్టడంతో మంచి టార్గెట్​ను ఆఫ్ఘాన్​ ముందు ఉంచింది. బ్యాటింగ్​లో మోస్తరుగా రాణించిన పాక్.. బౌలింగ్​లో మాత్రం దారుణంగా ఫెయిలైంది. ఆఫ్ఘాన్ ఓపెనర్లను ఆపడంలో ఆ టీమ్ బౌలర్లు విఫలమయ్యారు. షాహిన్ ఆఫ్రిదీ, హ్యారిస్ రౌఫ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కలిగిన పాకిస్థాన్​ను ఆఫ్ఘాన్ ఓపెనర్లు రెహ్మతుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (73 నాటౌట్) భయపెట్టారు.

గుర్బాజ్, జాద్రాన్ కలసి తొలి వికెట్​కు 130 రన్స్ జోడించారు. రౌఫ్​తో పాటు ఉసామా మీర్ బౌలింగ్​ను టార్గెట్ చేసుకొని బౌండరీల మీద బౌండరీలు కొట్టారు ఆఫ్ఘాన్ ఓపెనర్లు. ప్రత్యర్థి బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్న టైమ్​లో పాక్ ఫీల్డర్లు బంతుల్ని ఆపడంలో ఫెయిలయ్యారు. క్యాచ్​లు డ్రాప్ చేయడంతో పాటు బౌండరీలను ఆపడంలో విఫలమయ్యారు. దీంతో బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఆ టీమ్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అయితే ఏం చేయాలో పాలుపోక ఎడమ చేతి కీపింగ్ గ్లౌజ్​ను ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. దీంతో ఫీల్డర్లు, బౌలర్లు తమ పరువు తీశారని పాక్ ఫ్యాన్స్ నెట్టింట ఫైర్ అవుతున్నారు. మరి.. రిజ్వాన్ రియాక్షన్ చూశాక మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ విషయంలో రోహిత్-కోహ్లీ మధ్య వాదన! ఏకంగా గ్రౌండ్​లోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి