పాకిస్థాన్ టీమ్‌కు ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయింది. పసికూన ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో బాబర్ సేన చిత్తయింది. వన్డేల్లో పాక్‌పై ఆఫ్ఘాన్ గెలవడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
పాకిస్థాన్ టీమ్‌కు ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయింది. పసికూన ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో బాబర్ సేన చిత్తయింది. వన్డేల్లో పాక్‌పై ఆఫ్ఘాన్ గెలవడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ టీమ్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. భారత్‌పై మ్యాచ్‌లో ఓటమితో డీలాపడ్డ దాయాది జట్టును నెక్స్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చావు దెబ్బ తీసింది. దీంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘానిస్థాన్ చేతిలో ఓడిపోయింది బాబర్ సేన. వన్డే క్రికెట్ హిస్టరీలో ఇప్పటిదాకా పాకిస్థాన్‌ను ఆఫ్ఘాన్ ఓడించలేదు. కానీ ఇవాళ హిస్టరీని క్రియేట్ చేసింది. 283 రన్స్ టార్గెట్‌ను 49 ఓవర్లలో ఛేజ్ చేసి తొలిసారి పాక్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు మంచి స్టార్ట్ దొరికింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (58), ఇమాముల్ హక్ (17) బాగా ఆడారు.
ఇమాముల్ ఔటైనా బాబర్ ఆజం (74), షఫీక్‌కు మధ్య మరో పార్ట్నర్షిప్ నెలకొంది. అయితే బాబర్ తర్వాత రిజ్వాన్ (8), సౌద్ షకీల్ (25) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (40), ఇఫ్తికార్ అహ్మద్ (40) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా ఇఫ్తికార్ బౌండరీలు, సిక్సులతో ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచింది పాకిస్థాన్. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆఫ్ఘానిస్థాన్కు సూపర్బ్ స్టార్ట్ లభించింది. రెహ్మనుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్ (87)లు పాక్ బౌలర్లపై అటాకింగ్‌కు దిగారు. షాహిన్ అఫ్రిదీ, హ్యారిస్ రౌఫ్ బౌలింగ్‌లో బౌండరీల మీద బౌండరీలు కొట్టారు.
ఆఫ్ఘానిస్థాన్ విజయం దిశగా దూసుకెళ్తున్న టైమ్‌లో గుర్బాజ్‌ను షాహిన్ ఔట్ చేశాడు. అయితే ఇబ్రహీం జాద్రాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన రెహ్మత్ షాతో కలసి రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత జాద్రాన్‌ను హసన్ అలీ ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్‌లో పాకిస్థాన్ పట్టు బిగిస్తుందేమోనని అనిపించింది. కానీ రెహ్మత్ షా (77 నాటౌట్), హష్మతుల్లా షాహిదీ (44 నాటౌట్) పాక్‌కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. హష్మతుల్లా కెప్టెన్సీ నాక్ ఆడి టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘానిస్థాన్.. తాజాగా పాక్‌ను కూడా చిత్తు చేసింది. ఈ ఓటమితో పాక్‌కు ఉన్న కాస్త పరువు కూడా పోయిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆఫ్ఘాన్ చేతిలో పాక్ ఓటమిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ దసరా సెలబ్రేషన్స్.. ఆయుధ పూజ అదిరింది!
WINNG CELEBRATION BY AFGHANISTAN…..!!!!
– A HISTORIC MOMENT. pic.twitter.com/f88muSXsN7
— Johns. (@CricCrazyJohns) October 23, 2023