Nidhan
Pakistan Uses AI In Selecting Players: బంగ్లాదేశ్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. ఈ తరుణంలో ప్లేయర్ల సెలెక్షన్ గురించి పాక్ బోర్డు చీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Pakistan Uses AI In Selecting Players: బంగ్లాదేశ్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. ఈ తరుణంలో ప్లేయర్ల సెలెక్షన్ గురించి పాక్ బోర్డు చీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Nidhan
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అన్ని రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. క్రీడల్లోనూ ఏఐ సాయంతో ఆడియెన్స్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ టెక్నాలజీని వాడుతున్న తీరు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. నిత్యం ఏదో ఒక విషయంలో ట్రోల్స్‌కు గురవుతుంటారు పాక్ క్రికెటర్లు, ఆ దేశ బోర్డు. ఇప్పుడు మరోమారు విమర్శలు ఎదుర్కొంటోంది పీసీబీ. ప్లేయర్ల సెలెక్షన్ కోసం పాక్ బోర్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? పీసీబీ ఏఐని ఎలా వాడిందో తెలుసుకుందాం..
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎన్నో అంచనాల మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగిన దాయాది జట్టు తుస్సుమంది. దీంతో ఆ టీమ్‌పై, ప్లేయర్ల సెలెక్షన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్‌లో దారుణంగా ఆడినా మళ్లీ ఆ ఆటగాళ్లనే టీమ్‌లోకి తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయంపై పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ రియాక్ట్ అయ్యారు. పాక్ టీమ్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కానీ పొట్టి కప్పు తర్వాత ఈ పని చేయలేకపోయామన్నాడు. కొత్తవారిని జట్టులోకి తీసుకుందామంటే తమ వద్ద సరైన డేటా లేదన్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నామని తెలిపాడు. త్వరలో జరిగే ఓ డొమెస్టిక్ టోర్నీ కోసం ఏఐ సాయంతో ఆటగాళ్లను ఎంపిక చేశామన్నాడు.
‘కొత్తవారిని తీసుకుందామంటే మా వద్ద సరైన డేటా లేదు. జట్టును ప్రక్షాళన చేద్దామని అనుకున్నా కొత్తవారిని గుర్తించేందుకు ఎలాంటి ప్లానింగ్ లేదు. ఇక్కడి వ్యవస్థ కరెక్ట్‌గా లేదు. త్వరలో జరిగే ఛాంపియన్స్ కప్‌తో న్యూ టాలెంట్‌ను పట్టుకుంటాం. ఆ టోర్నమెంట్‌లోని ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన డేటాను సేకరిస్తాం. ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. కానీ చాలా మంది డేటా మా వద్ద లేదు. త్వరలో జరిగే ఛాంపియన్స్ కప్ కోసం 150 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేశాం. ఈ ఎంపికలో ఇందులో ఏఐ పాత్ర 80 శాతం, సెలెక్షన్ కమిటీ పాత్ర 20 శాతం ఉంది. ఇక మీదట ఎవరు సరిగ్గా ఆడకపోయినా వారిని వెంటనే రీప్లేస్ చేస్తాం’ అని నఖ్వీ చెప్పుకొచ్చాడు.
పీసీబీ ఏఐ సాయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏఐ సాయం తీసుకుంటే ఇంక సెలెక్టర్లు ఎందుకు? వాళ్లకు లక్షల జీతాలు ఎందుకని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎవరిలో ఏ స్కిల్ ఉంది? ఇప్పుడు ఫెయిల్ అయినా లాంగ్ టైమ్‌లో ఎవరు పెర్ఫార్మ్ చేయగలరు లాంటి విషయాలన్ని ఏఐ చెబుతుందా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి వింతలన్నీ పాక్ క్రికెట్లోనే జరుగుతాయి.. పాకిస్థానోళ్లు అంటార్రా బాబు అని ట్రోల్ చేస్తున్నారు. మరి.. ప్లేయర్ల సెలెక్షన్ కోసం ఏఐ సాయం తీసుకోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
PCB chairman Mohsin Naqvi has revealed that the board is using artificial intelligence (AI) to prepare squads for the upcoming Champions Cup 👀#ChampionsCup #PCB #MohsinNaqvi #AI #CricketTwitter pic.twitter.com/IHQLsAksgv
— InsideSport (@InsideSportIND) August 27, 2024