iDreamPost
android-app
ios-app

ఆ టీమిండియా స్టార్​ను మించినోడు క్రికెట్​ హిస్టరీలోనే లేడు.. అండర్సన్ కామెంట్స్!

  • Published Aug 27, 2024 | 3:54 PM Updated Updated Aug 27, 2024 | 3:54 PM

James Anderson Praises Virat Kohli: ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ సుదీర్ఘ కెరీర్​లో ఎంతో మంది టాప్ బ్యాటర్లను ఫేస్ చేశాడు. అయితే ఆ టీమిండియా స్టార్ మాత్రం వాళ్లలో స్పెషల్ అని అంటున్నాడు జిమ్మీ. అతడ్ని మించినోడు క్రికెట్‌ హిస్టరీలోనే లేడని చెబుతున్నాడు.

James Anderson Praises Virat Kohli: ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ సుదీర్ఘ కెరీర్​లో ఎంతో మంది టాప్ బ్యాటర్లను ఫేస్ చేశాడు. అయితే ఆ టీమిండియా స్టార్ మాత్రం వాళ్లలో స్పెషల్ అని అంటున్నాడు జిమ్మీ. అతడ్ని మించినోడు క్రికెట్‌ హిస్టరీలోనే లేడని చెబుతున్నాడు.

  • Published Aug 27, 2024 | 3:54 PMUpdated Aug 27, 2024 | 3:54 PM
ఆ టీమిండియా స్టార్​ను మించినోడు క్రికెట్​ హిస్టరీలోనే లేడు.. అండర్సన్ కామెంట్స్!

ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ రెండు దశాబ్దాలకు పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. ఇటీవలే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడీ దిగ్గజం. సుదీర్ఘ కెరీర్​లో ఎందరో టాప్ బ్యాటర్స్​ను అతడు ఫేస్ చేశాడు. తోపు ప్లేయర్లను కూడా తన పేస్ మ్యాజిక్​తో ముప్పుతిప్పలు పెట్టి ఎదురులేని బౌలర్​గా ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి అండర్సన్ తాను బౌలింగ్ చేసిన వారిలో ఆ టీమిండియా స్టార్ మాత్రం చాలా స్పెషల్ అని అంటున్నాడు. అతడ్ని మించినోడు క్రికెట్‌ హిస్టరీలోనే లేడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ఎందరో బ్యాటర్లను చూసుంటాం.. కానీ అతడి లాంటోడు మళ్లీ తారసపడటం కష్టమేనని చెబుతున్నాడు. అండర్సన్ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆ భారత బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అండర్సన్ ప్రశంల జల్లులు కురిపించాడు. కోహ్లీ లాంటోడు క్రికెట్ హిస్టరీలోనే లేడని మెచ్చుకున్నాడు. టెయిలెండర్స్​ అనే పాడ్​కాస్ట్​లో పాల్గొన్న జిమ్మీ విరాట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ మాదిరిగా ఛేజింగ్ చేసే మొనగాడు, సెకండ్ ఇన్నింగ్స్​లో అంతలా రెచ్చిపోయే బ్యాటర్ మరొకరు లేరు. క్రికెట్ హిస్టరీలోనే అతడు అత్యుత్తమ ఫినిషర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఛేజింగ్​​లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. సెకండ్ ఇన్నింగ్స్​లో అతడు చేసిన సెంచరీలు నమ్మశక్యం కానివి. అతడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ. ఈ నమ్మకం కారణంగానే అతడు ఛేజింగ్​లో ఇంతలా సక్సెస్ అయ్యాడు’ అని అండర్సన్ చెప్పుకొచ్చాడు.

James Anderson

ఛేజింగ్ టైమ్​లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కోహ్లీ తన మెంటాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్​తో దాన్ని ఈజీగా అధిగమిస్తాడని అండర్సన్ తెలిపాడు. వైట్​బాల్ క్రికెట్​లో అతడ్ని మించిన ఫినిషర్ లేడని మెచ్చుకున్నాడు. లిమిటెడ్‌ ఓవర్స్​ క్రికెట్​లో బెస్ట్ ఫినిషర్​గా కొందరు ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ బెవాన్ పేరు చెబుతుంటారు. నంబర్​ 6లో బ్యాటింగ్​కు దిగే బెవాన్.. ధనాధన్ ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థుల నుంచి మ్యాచ్​లు లాగేసుకునేవాడు. ఇదే విషయాన్ని అండర్సన్​ను అడగ్గా.. బెవాన్ కంటే కోహ్లీనే బెస్ట్ అని స్పష్టం చేశాడు. కోహ్లీ నంబర్ 3లో దిగి ఆఖరి వరకు బ్యాటింగ్ చేస్తాడని, మ్యాచ్ ఫినిష్ చేయకుండా బయటకు వెళ్లడని తెలిపాడు. భారీ సెంచరీలు బాదుతూ టీమ్​ను ఫినిష్ లైన్స్​కు చేరుస్తాడని, అతడి కంటే బెటర్ ఫినిషర్ క్రికెట్​ హిస్టరీలో లేడని.. అతడికి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. మరి.. కోహ్లీ లాంటోడు క్రికెట్ హిస్టరీలో లేడంటూ జిమ్మీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.