iDreamPost
android-app
ios-app

AI సాయంతో ప్లేయర్ల సెలెక్షన్.. పాకిస్థానోళ్లు అంటార్రా బాబు!

  • Published Aug 27, 2024 | 5:07 PM Updated Updated Aug 27, 2024 | 5:07 PM

Pakistan Uses AI In Selecting Players: బంగ్లాదేశ్​ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్​కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. ఈ తరుణంలో ప్లేయర్ల సెలెక్షన్ గురించి పాక్ బోర్డు చీఫ్​ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

Pakistan Uses AI In Selecting Players: బంగ్లాదేశ్​ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్​కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. ఈ తరుణంలో ప్లేయర్ల సెలెక్షన్ గురించి పాక్ బోర్డు చీఫ్​ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

  • Published Aug 27, 2024 | 5:07 PMUpdated Aug 27, 2024 | 5:07 PM
AI సాయంతో ప్లేయర్ల సెలెక్షన్.. పాకిస్థానోళ్లు అంటార్రా బాబు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ను అన్ని రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. క్రీడల్లోనూ ఏఐ సాయంతో ఆడియెన్స్ వ్యూయింగ్ ఎక్స్​పీరియెన్స్​ను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ టెక్నాలజీని వాడుతున్న తీరు గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. నిత్యం ఏదో ఒక విషయంలో ట్రోల్స్​కు గురవుతుంటారు పాక్ క్రికెటర్లు, ఆ దేశ బోర్డు. ఇప్పుడు మరోమారు విమర్శలు ఎదుర్కొంటోంది పీసీబీ. ప్లేయర్ల సెలెక్షన్ కోసం పాక్ బోర్డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ సాయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? పీసీబీ ఏఐని ఎలా వాడిందో తెలుసుకుందాం..

స్వదేశంలో బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎన్నో అంచనాల మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్​తో బరిలోకి దిగిన దాయాది జట్టు తుస్సుమంది. దీంతో ఆ టీమ్​పై, ప్లేయర్ల సెలెక్షన్​పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్​లో దారుణంగా ఆడినా మళ్లీ ఆ ఆటగాళ్లనే టీమ్​లోకి తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయంపై పీసీబీ చీఫ్ మోహ్​సిన్ నఖ్వీ రియాక్ట్ అయ్యారు. పాక్ టీమ్​ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కానీ పొట్టి కప్పు తర్వాత ఈ పని చేయలేకపోయామన్నాడు. కొత్తవారిని జట్టులోకి తీసుకుందామంటే తమ వద్ద సరైన డేటా లేదన్నాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నామని తెలిపాడు. త్వరలో జరిగే ఓ డొమెస్టిక్ టోర్నీ కోసం ఏఐ సాయంతో ఆటగాళ్లను ఎంపిక చేశామన్నాడు.

Pakisthan

‘కొత్తవారిని తీసుకుందామంటే మా వద్ద సరైన డేటా లేదు. జట్టును ప్రక్షాళన చేద్దామని అనుకున్నా కొత్తవారిని గుర్తించేందుకు ఎలాంటి ప్లానింగ్ లేదు. ఇక్కడి వ్యవస్థ కరెక్ట్​గా లేదు. త్వరలో జరిగే ఛాంపియన్స్ కప్​తో న్యూ టాలెంట్​ను పట్టుకుంటాం. ఆ టోర్నమెంట్​లోని ప్రతి మ్యాచ్​కు సంబంధించిన డేటాను సేకరిస్తాం. ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. కానీ చాలా మంది డేటా మా వద్ద లేదు. త్వరలో జరిగే ఛాంపియన్స్ కప్ కోసం 150 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేశాం. ఈ ఎంపికలో ఇందులో ఏఐ పాత్ర 80 శాతం, సెలెక్షన్ కమిటీ పాత్ర 20 శాతం ఉంది. ఇక మీదట ఎవరు సరిగ్గా ఆడకపోయినా వారిని వెంటనే రీప్లేస్ చేస్తాం’ అని నఖ్వీ చెప్పుకొచ్చాడు.

పీసీబీ ఏఐ సాయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏఐ సాయం తీసుకుంటే ఇంక సెలెక్టర్లు ఎందుకు? వాళ్లకు లక్షల జీతాలు ఎందుకని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎవరిలో ఏ స్కిల్ ఉంది? ఇప్పుడు ఫెయిల్ అయినా లాంగ్ టైమ్​లో ఎవరు పెర్ఫార్మ్ చేయగలరు లాంటి విషయాలన్ని ఏఐ చెబుతుందా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి వింతలన్నీ పాక్ క్రికెట్​లోనే జరుగుతాయి.. పాకిస్థానోళ్లు అంటార్రా బాబు అని ట్రోల్ చేస్తున్నారు. మరి.. ప్లేయర్ల సెలెక్షన్ కోసం ఏఐ సాయం తీసుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.