iDreamPost
android-app
ios-app

పాక్ నెట్ బౌలర్​గా హైదరాబాద్ కుర్రాడు.. ప్రశంసలతో ముంచెత్తిన ఫఖర్ జమాన్!

  • Author singhj Updated - 11:29 AM, Fri - 29 September 23
  • Author singhj Updated - 11:29 AM, Fri - 29 September 23
పాక్ నెట్ బౌలర్​గా హైదరాబాద్ కుర్రాడు.. ప్రశంసలతో ముంచెత్తిన ఫఖర్ జమాన్!

వన్డే వరల్డ్ కప్​-2023కు అంతా రెడీ అయిపోయింది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచ కప్​ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్​తో ఆరంభం కానుంది. మెగా టోర్నీలోని మొదటి మ్యాచ్​కు అహ్మదాబాద్ వేదికగా నిలవనుంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా టీమ్స్ అన్ని ఇండియాకు వస్తున్నాయి. రీసెంట్​గా హైదరాబాద్​కు చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు గ్రాండ్ వెల్​కమ్ లభించింది. పాక్ టీమ్ శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో దిగగానే వందలాది మంది క్రికెట్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దాయాది జట్టు హోటల్​కు రాగానే అక్కడ కూడా కండువాలు కప్పి ఆహ్వానించారు.

భారత్ ఆతిథ్యం అద్భుతమని పాకిస్థాన్ క్రికెటర్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్​గా మారాయి. ఇవి చూసిన పాక్ ఫ్యాన్స్ భారత్​కు బాకీ పడ్డామని.. థ్యాంక్యూ ఇండియా అంటూ కామెంట్స్ పెట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 2025లో తమ దేశానికి వస్తే టీమిండియాకు ఇంతకు మించిన రేంజ్​లో స్వాగతం చెబుతామని పాక్ అభిమానులు అంటున్నారు. ఆతిథ్యం సంగతి పక్కనబెడితే.. వార్మప్ మ్యాచులకు పాక్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్​తో తలపడేందుకు దాయాది జట్టు సిద్ధమవుతోంది.

హైదరాబాద్​లో దిగిన పాకిస్థాన్ టీమ్ ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్​కు చెందిన అండర్-19 పేసర్ నిశాంత్ సరను తమ నెట్​ బౌలర్​గా నియమించుకుంది. న్యూజిలాండ్​తో వార్మప్ మ్యాచ్​కు ముందు నెట్స్​లో పాకిస్థాన్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ యంగ్ పేసర్ గంటకు 140 నుంచి 150 కి.మీ.ల వేగంతో బంతులు విసరగలడట. ఆరడుగులకు పైగా ఉన్న నిశాంత్ బౌన్సర్లు కూడా బాగా వేస్తాడట. అందుకే నెట్ బౌలర్​గా పాక్ అతడ్ని ఎంచుకుందట. నిశాంత్ బౌలింగ్​ను ఎదుర్కొన్న పాక్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్రశంసల జల్లులు కురిపించాడు. నిశాంత్ బౌలింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయని.. అతడు కచ్చితంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని మెచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ టీమ్​లో మార్పు.. రవిచంద్రన్ అశ్విన్ వచ్చేశాడు!